రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రైవేట్ రుణదాత  ఔట్ లుక్ అప్‌గ్రేడ్ చేసిన తరువాత, ఆర్బిఐ గవర్నర్ యెస్ బ్యాంకులో జమ చేసిన డిపాజిటర్లకు హామీ ఇచ్చారు దీంతో యెస్ బ్యాంక్ షేర్లు నేటి సెషన్‌లో ఆకాశాన్నంటాయి. యెస్ బ్యాంక్ షేర్ ధర ఈ రోజు ఉదయం 73 శాతం పెరిగి రూ .64.15 కు చేరుకుంది. అంతకు ముందు రోజు రూ. 37తో ముగిసాయి. 

బిఎస్ఇ సెన్సెక్స్ 2.5 శాతం పడిపోయాక, యెస్ బ్యాంక్ షేర్లు బిఎస్ఇలో రూ.21 లేదా 58 శాతం బలపడి రూ.58 రూపాయలతో నిలిచాయి.

సోమవారం, ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ యెస్ బ్యాంక్ పెట్టుబడిదారులకు తమ డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని హామీ ఇచ్చారు అవసరమైతే, యెస్ బ్యాంకుకు అవసరమైన నిధులు అందించడానికి సెంట్రల్ బ్యాంక్ అడుగు పెడుతుందని హామీ ఇచ్చారు.

also read బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు... ఏప్రిల్ 3న నిర్ణయం...

గత రెండు రోజుల్లో ప్రైవేటు రంగ రుణదాతల స్టాక్ 100 శాతం పెరిగింది. మొత్తం మీద, గత 7 ట్రేడింగ్ సెషన్లలో షేర్లు 1,000 శాతం జూమ్ చేశాయి, మార్చి 6న ఆల్-టైమ్ కనిష్ట స్థాయి 5.5 రూపాయలకు తాకింది.

పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం 6 గంటల నుంచి యస్‌ బ్యాంక్‌పై మారటోరియం తొలగిపోతుందని, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. దీంతో ఖాతా దారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా విత్‌డ్రాలు, లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు.  

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రతిపాదించిన పథకం ప్రకారం సంక్షోభానికి గురైన యెస్ బ్యాంకు పునర్నిర్మాణానికి ప్రభుత్వం అంతకుముందు ఆమోదం తెలిపింది. ఆర్‌బిఐ రెస్క్యూ ప్లాన్‌లో భాగంగా, భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ  ప్రైవేటు రంగ రుణదాత యెస్ బ్యాంకులో 49 శాతం పొందనుంది.

ఐసిఐసిఐ బ్యాంక్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి), యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఎస్‌బి‌ఐ నేతృత్వంలోని కన్సార్టియంలో చేరాయి.

also read బంగారం ధర 5 వేలు తగ్గి మళ్ళీ పెరిగింది...10గ్రా. ఎంతంటే ?

తాజాగా పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను సానుకూల అంచనాలతో అప్‌గ్రేడ్‌ చేసినట్లు రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ వెల్లడించింది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్‌ కుమార్‌ కొత్త ఎండీ, సీఈవోగా బోర్డు పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

ప్రైవేట్ బ్యాంకుల పెట్టుబడులు ఇప్పటివరకు రూ.3,950 కోట్లకు చేరుకున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక్కొక్కటి రూ .1000 కోట్లు, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వరుసగా రూ .600 కోట్లు, రూ .500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఉన్నాయి.

ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ వారి కమిట్మెంట్ ప్రకారం  సంక్షోభంలో ఉన్న యెస్ బ్యాంకులో ఒక్కొక్కటి 300 కోట్ల రూపాయల షెర్స్ పొందనున్నాయి.