మార్చి చివరిలో భారతదేశంలో కఠినమైన లాక్ డౌన్  విధించిన తరువాత మొదటిసారిగా పెట్రోల్ అమ్మకాలు పెరిగాయి. ఇంధన డిమాండ్ రికవరీ మధ్య ప్రపంచ చమురు మార్కెట్లకు ఇది సానుకూల సంకేతం.

భారతదేశంలోని మూడు అతిపెద్ద ఇంధన రిటైలర్ల అమ్మకాలలు సెప్టెంబర్ మొదటి అర్ధభాగంలో 2.2% పెరిగాయి, ఈ విషయంపై ప్రత్యక్ష పరిజ్ఞానం ఉన్న అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం గత ఆరు నెలల్లో ఇది మొదటి పెరుగుదల అని తెలిపారు.

ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుల పెట్రోల్ అమ్మకాలు పెరగడం అనేది ప్రపంచ మార్కెట్ స్వాగతించే పరిణామం, లాక్ డౌన్ కారణాంగ ఇంధన డిమాండ్ తిరిగి కరోనా వైరస్ పూర్వ స్థాయికి ఎప్పుడు వస్తుందో అని అంచనాలను వేసిన వారి ఆలోచన మార్చేసింది.

also read నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పై సైబర్ దాడి.. 100కి పైగా కంప్యూటర్లు హ్యాక్ .. ...

దేశంలో ఎక్కువగా ఉపయోగించే డీజిల్ అమ్మకాలు అంతకుముందు సంవత్సరంతో పోచుకుంటే 6% తగ్గాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షల సడలింపు వల్ల ప్రజలు వారి కార్యాలయాలకు, ఆఫీసులకు  వెళ్లడానికి వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగే అవకాశం ఉంది అని కొందరు అధికారులు అన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుదల ఉన్నప్పటికీ భారతదేశంలో చాలా వరకు ఆంక్షలను సడలించింది. ప్రజా రవాణాలో ప్రయాణించే వారు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి వ్యక్తిగత వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

దీని వల్ల  కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు మెరుగుపర్చవచ్చు అందులో ఇవి ప్రధానంగా పెట్రోల్ పైనే  నడుస్తాయి. భారతదేశంలో కార్ల అమ్మకాలు ఆగస్టులో 14% పెరిగాయి, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 3% పెరిగాయి.

ఇండియన్ ఆయిల్ కార్ప్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య మాట్లాడుతూ ఈ వారం ఇంధన డిమాండ్ కోలుకునే సంకేతాలు ఉన్నాయని, అయితే కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం వల్ల ఆలస్యమవుతుందని, వాహనదారుల నెలవారీ పెట్రోల్ వినియోగం ఈ సంవత్సరం చివరినాటికి కరోనా వైరస్ పూర్వ స్థాయికి చేరుకుంటుందని అన్నారు.