కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రైళ్లపై  ఇండియన్ రైల్వేస్ శుభవార్త అందించింది. ఉద్యోగాలకు, రోజు రైళ్లలో ప్రయాణం చేసే వారికి ఇది గుడ్ న్యూస్. సెప్టెంబర్ 21 నుంచి దేశవ్యాప్తంగా 40 క్లోన్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ప్రయాణీకుల రద్దీ, అధిక వెయిటింగ్ లిస్టులు ఉన్న రూట్లలో ఈ క్లోన్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ క్లోన్ ట్రైన్స్‌కు 10 రోజులకు ముందే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే వీలు కల్పిస్తూ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ను సెప్టెంబర్ 19న మొదలు కానుంది.

అయితే ఈ క్లోన్ ట్రైన్స్‌ సాధారణ రైళ్ల కంటే ముందుగా బయల్దేరతాయని వీటికి హల్టింగులు కూడా తక్కువగా ఉంటాయని రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

also read వరుసగా రెండవ రోజు పెట్రోల్‌, డీజిల్ ధరల తగ్గింపు.. నేడు ఎంతంటే ?

ఈ క్లోన్ ట్రైన్ లో ప్రయనాలకి అధిక ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మొత్తం 40 రైళ్లలో 32 మాత్రం బీహార్ ప్రయాణీకులకే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

మిగిలిన వాటిలో తెలంగాణకు రెండు రైళ్లను కేటాయించింది, కానీ ఏపీకి మాత్రం ఒక్క ట్రైన్ కూడా కేటాయించలేదు. సికింద్రాబాద్ నుంచి ధానాపూర్ క్లోన్(02787/88) ట్రైన్స్ ను తెలంగాణకు కేటాయించింది. మరో విషయం ఏంటంటే సికింద్రాబాదులో తప్పితే ఈ రైలుకు రాష్ట్రంలో మరెక్కడా హల్టింగ్ ఉండదు.

ఇప్పటికే నడుస్తున్న 310 ప్రత్యేక రైళ్లకు అదనంగా ఈ రైళ్లు ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు బయలుదేరే ముందు ఈ రైళ్లు ఒకటి లేదా రెండు గంటల ముందు నడుస్తాయి భారత రైల్వే మంగళవారం తెలిపింది.