Asianet News TeluguAsianet News Telugu

వరుసగా రెండవ రోజు పెట్రోల్‌, డీజిల్ ధరల తగ్గింపు.. నేడు ఎంతంటే ?

దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ల ప్రకారం ఢీల్లీలో పెట్రోల్ ధర పై 17 పైసలు, డీజిల్ పై 22 పైసలు తగ్గాయి. గత రెండు రోజులలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశ రాజధానిలో మొదటి రోజు 31 పైసలు, రెండవ రోజు 37 పైసలు తగ్గించారు. 

Petroland diesel price cut for second day straight; check latest fuel rates here
Author
Hyderabad, First Published Sep 15, 2020, 4:07 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండవ రోజు అన్ని మెట్రోలలో నగరాలలో దిగి వచ్చాయి. దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ల ప్రకారం ఢీల్లీలో పెట్రోల్ ధర పై 17 పైసలు, డీజిల్ పై 22 పైసలు తగ్గాయి.

గత రెండు రోజులలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశ రాజధానిలో మొదటి రోజు 31 పైసలు, రెండవ రోజు 37 పైసలు తగ్గించారు. ఢీల్లీలో ప్రస్తుత పెట్రోల్ ధర లీటరుకు రూ.81.55, డీజిల్ లీటరుకు రూ.72.56 వద్ద ఉంది.

గత 15 రోజుల్లో ఢీల్లీలో డీజిల్ రేట్లు ఏడుసార్లు తగ్గింది. సెప్టెంబర్ 3, 5, 7, 10, 12, 14 ఇంకా 15 తేదీలలో చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను నాలుగుసార్లు తగ్గించాయి. మొత్తం మీద ఢీల్లీలో పెట్రోల్ ధర సెప్టెంబరులో 53 పైసలు, డీజిల్ రూ.1 తగ్గాయి.

also read సింగల్ బెడ్ రూం లాంటి షారుఖ్ ఖాన్ లగ్జరీ వ్యాన్ చూసారా..

పెట్రోల్, డీజిల్ ధరలు ఇతర మెట్రో నగరాల్లో కూడా తగ్గాయి. ముంబైలో సెప్టెంబర్ 15న పెట్రోల్ ధర 17 పైసలు, డీజిల్ ధర 24 పైసలు తగ్గింది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.88.21, డీజిల్ ధర రూ .79.05 గా ఉంది. చెన్నై, కోల్‌కతాలో డీజిల్ రేట్లను సెప్టెంబర్ 15న వరుసగా 21 పైసలు తగ్గించారు.

హైదరాబాద్, బెంగళూరులలో డీజిల్ ధరలు మంగళవారం 24 పైసలు తగ్గాయి. మరోవైపు ఈ రోజు పెట్రోల్ ధర కోల్‌కతాలో  17 పైసలు, చెన్నైలలో 15 పైసలు తగ్గింది. బెంగళూరు, హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు 18 పైసలు తగ్గాయి.

మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు  తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ క్షీణించడంతో  బ్రెంట్ క్రూడాయిల్ ధర 3 సెంట్లు లేదా 0.1 శాతం తగ్గి 39.58 డాలర్ల వద్ద ఉంది. దీంతో దేశీయంగా పెట్రోలు ధరలు మరింత దిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios