Asianet News TeluguAsianet News Telugu

బుక్ చేసుకున్న రైలు టికెట్‌పై జర్నీ డేట్ మార్చుకోవడం ఎలాగంటే?

సుదూరాలు ప్రయాణించే ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఒక్కోసారి మనం రైలు టికెట్ బుక్ చేసుకున్న రోజున ప్రయాణం చేయాల్సి రాకపోవచ్చు. ముందుగానీ, తర్వాత గానీ ప్రయాణం వాయిదా పడవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు భారత రైల్వే మరో సౌకర్యాన్ని కల్పించింది.

Indian Railways Reservation: How To Change Journey Date,   Upgrade To Higher Class And More
Author
Hyderabad, First Published May 4, 2019, 4:16 PM IST

సుదూరాలు ప్రయాణించే ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఒక్కోసారి మనం రైలు టికెట్ బుక్ చేసుకున్న రోజున ప్రయాణం చేయాల్సి రాకపోవచ్చు. ముందుగానీ, తర్వాత గానీ ప్రయాణం వాయిదా పడవచ్చు. 

ఈ పరిస్థితిని అధిగమించేందుకు భారత రైల్వే మరో సౌకర్యాన్ని కల్పించింది. indianrailways.gov.in సైట్‌లో పేర్కొనబడిన ప్రకారం.. మనం బుక్ చేసిన టికెట్ ఖరారైనప్పటికీ/ఆర్ఏసీ(రిజర్వేషన్ అగెయినిస్ట్ క్యాన్సలేషన్)/వెయిట్ లిస్ట్‌డ్ టికెట్స్‌.. ప్రయాణపు తేదీని మార్చుకోవచ్చు.

అంతేగాక, అదే క్లాసులో ప్రయాణించాలా? లేక హైయ్యర్ క్లాసులో ప్రయాణించాలా? అనేది కూడా ప్రయాణికులు ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకు తగిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా పెంచుకోవచ్చు. బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు.  ఇవన్నీ ఆఫ్‌లైన్ టికెట్ బుక్ చేసుకున్న వారికి వర్తిస్తాయి. మిగితావన్నీ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకున్నవారికి వర్తిస్తాయి. 

భారత రైల్వేలు అందిస్తున్న ఐదు రకాలు సౌకర్యాలు:

1. స్టేషన్ కౌంటర్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారికి.. ప్రయాణ తేదీ ముందుగానీ, తర్వాత గానీ మార్చుకునే వీలు కల్పిస్తోంది. ఇది ఒక్కసారి మాత్రమే. అకామిడేషన్ ఉందా? టికెట్ ఖరారైందా? ఆర్ఏసీయా లేక వెయిట్ లిస్ట్‌డా? అనే విషయాలతో సంబంధం లేకుండా మార్పులు చేసుకోవచ్చు.

2. ప్రయాణ తేదీని మార్చుకోవాలనుకుంటే..  రైలు బయల్దేరే కనీసం 48గంటల ముందే ప్రయాణికులు వారి టికెట్లను రిజర్వేషన్ కార్యాలయంలో సమర్పించాలి. ఇది ఆఫ్‌లైన్ టికెట్ బుక్ చేసుకున్న వారికే వర్తిస్తుంది.

3. ప్రయాణ మార్గాన్ని పెంచుకోవాలనుకుంటే టికెట్ చెకింగ్ స్టాఫ్‌ను ముందే సంప్రదించాల్సి ఉంటుంది. లేదంటే బుక్ చేసిన జర్నీ పూర్తయిన తర్వాత గానీ సంప్రదించాలి.

4. ఒరిజినల్ బోర్డింగ్ స్టేషన్ మేనేజర్ లేదా కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సెంటర్‌లో ప్రయాణానికి 24గంటల ముందుగా సంప్రదించి బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే ఇందులో ఎలాంటి రిఫండ్ ఉండదు. ఈ సౌకర్యం ఆన్‌లైన్, ఆఫ్ లైన్ టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి ఉంది.

5. అకామిడేషన్ లభ్యతను బట్టి రిజర్వేషన్ చేసుకున్న టికెట్లను లోయర్ క్లాస్ నుంచి హైయ్యర్ క్లాసుకి అదే రైలు, అదే తేదీలో చేసుకోవచ్చు. ఇది కూడా ఒక్కసారి మాత్రమే చేయబడుతుంది. అందుకు తగిన ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్(టీటీఈ)ని సంప్రదించి కూడా ఈ మార్పులు చేసుకోవచ్చు. అయితే, హైయ్యర్ క్లాసు నుంచి లోయర్ క్లాసుకి మార్చుకోవడానికి వీలులేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios