Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో మళ్ళీ చైనా కంపెనీల పెట్టుబడులు.. స్పష్టం చేసిన భారత ప్రభుత్వం..

చైనా పెట్టుబడులకు  ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. చైనాకు సంబంధించిన సుమారు 45 పెట్టుబడి ప్రతిపాదనలకు భారతదేశం ఆమోదం తెలిపిందని సోమవారం ఒక విదేశీ ఛానల్ పేర్కొంది.

indian government is not considering any proposal to allow any chinese company to invest in india
Author
Hyderabad, First Published Feb 24, 2021, 11:03 AM IST

ఇండో-చైనా సరిహద్దు  ఉద్రిక్తతల మధ్య చైనా కంపెనీల పెట్టుబడులను భారత్ ఆమోదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంబంధం ఉన్న అధికారులు భారతదేశంలో చైనాతో సంబంధం ఉన్న ఎటువంటి పెట్టుబడులను ఆమోదించే ఆలోచనలు   లేవని స్పష్టం చేశారు.

వన్నీ తప్పుడు  నివేదికలని  అధికారులు  కొట్టిపారేశారు. చైనా పెట్టుబడులకు  ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. చైనాకు సంబంధించిన సుమారు 45 పెట్టుబడి ప్రతిపాదనలకు భారతదేశం ఆమోదం తెలిపిందని సోమవారం ఒక విదేశీ ఛానల్ పేర్కొంది.  

హాంకాంగ్‌తో అనుసంధానించిన మూడు విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనల కోసం భారత ప్రభుత్వ ఆమోదం కోరినట్లు ఒక అధికారి తెలిపారు. వీటిలో రెండు జపనీస్ కంపెనీల పెట్టుబడులు, మూడవది ఎన్నారై గ్రూప్ నుండి పెట్టుబడులు ఉన్నాయి.

also read మీకు ఎల్‌పి‌జి గ్యాస్ కనెక్షన్ ఉందా.. అయితే సబ్సిడీ డబ్బు మీ ఖాతాలోకి వస్తుందో లేదో ఇలా తెలుసుకోండి....

అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి సరిహద్దులో శాంతి ముఖ్యమని భారత్ విశ్వసిస్తుందని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం, ఇరు సైన్యాలు తమ స్థాయిలో సరిహద్దులో శాంతిని పునరుద్ధరించడానికి  చర్యలు తీసుకుంటున్నాయి.

 సారి చైనా చర్యలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తొందర పాటు చేర్యాలు తీసుకోదు, నియంత్రణ రేఖపై చైనా తదుపరి చర్యలపై ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఇంకా  చైనాపై భారత్ విధించిన ఆంక్షలను తొలగించడానికి  ఎలాంటి ఆలోచన లేదు.

ప్రభుత్వం ఆమోదం కోరిన మూడు విదేశీ పెట్టుబడులు హాంకాంగ్ కేంద్రంగా ఉన్న కంపెనీలకు చెందినవి.

Follow Us:
Download App:
  • android
  • ios