మీ ఇంట్లో చాలా మందికి ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్ ఉండే ఉంటుంది. అయితే  చాలా మంది ప్రజలు సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటుంటారు. సబ్సిడీ డబ్బు ఇప్పుడు కేవలం 30-35 రూపాయలకు పరిమితం చేసినప్పటికీ, ఈ డబ్బు మీ ఖాతాలోకి వస్తుందా లేదా  అనేది దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

గ్యాస్ సబ్సిడీ డబ్బు మీ స్వంత బ్యాంకు ఖాతాకు వస్తున్నప్పటికి చాలా సార్లు డబ్బు బ్యాంకు ఖాతాకు చేరదు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే గ్యాస్ సబ్సిడీ డబ్బు మీ ఖాతాలోకి వస్తోందా లేదా అనేది ఎలా తెలుసుకోవలో చూద్దాం..

మొదట మీ స్మార్ట్‌ఫోన్ బ్రౌజర్‌లో  www.mylpg.in అని టైప్ చేయండి  . ఇప్పుడు మీరు కుడి వైపున ఉన్న గ్యాస్ కంపెనీల గ్యాస్ సిలిండర్ల ఫోటోలను చూస్తారు, మీ సర్వీస్ ప్రొవైడర్  గ్యాస్ సిలిండర్ల ఫోటోపై క్లిక్ చేయండి.

also read ఎస్‌బి‌ఐ కస్టమర్లకు హెచ్చరిక: మీ బ్యాంక్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింక్ చేయండి.. లేదంటే ? ...

దీని తరువాత మీ సర్వీస్ ప్రొవైడర్ నుండి క్రొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సైన్-ఇన్ ఇంకా కొత్త కస్టమర్  ఆప్షన్ కుడి వైపున  పై భాగంలో కనిపిస్తుంది. ఇప్పుడు, మీరు ఐ‌డిని క్రియేట్ చేసుకున్నట్లయితే సైన్ ఇన్ చేసి లేదా కొత్త కస్టమర్ పై క్లిక్ చేసి ఐ‌డిని  క్రియేట్ చేసుకోండీ.

లాగిన్ అయిన తర్వాత మీరు కుడి వైపున వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ చూస్తారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీకు ఏ సిలిండర్ సబ్సిడీ లభించిందో, ఎప్పుడు లభిస్తుందో మీకు సమాచారం చూపిస్తుంది. ఒకవేళ మీ ఖాతాలో సబ్సిడీ డబ్బు రాకపోతే మీరు ఫీడ్‌బ్యాక్ బటన్‌ను క్లిక్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

మీరు మీ ఎల్‌పిజి ఐడిని బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకపోతే, మీరు డిస్ట్రిబ్యూటర్ సంప్రదించడం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలాగే మీరు 18002333555 కు ఉచితంగా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.