Asianet News TeluguAsianet News Telugu

భారతీయ యువతికి మైక్రోసాఫ్ట్ బంపర్ గిఫ్ట్.. ఫేస్‌బుక్‌తో పాటు అజూర్ క్లౌడ్ సిస్టమ్‌లో బగ్‌ను కనుగొన్నందుకు..

ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ అదితి సింగ్ మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్ సర్వీస్‌ అజ్యూర్‌లో బగ్‌ను గుర్తించినందుకు 30,000 డాలర్ల(సుమారు రూ.22 లక్షలు) రివార్డును గెలుచుకుంది.

Indian girl  aditi singh gets over Rs 22 lakh bounty from Microsoft for finding bug in Azure cloud system
Author
Hyderabad, First Published Jun 29, 2021, 7:26 PM IST

 మైక్రోసాఫ్ట్  అజూర్ క్లౌడ్ సిస్టమ్‌లో బగ్‌ను గుర్తించినందుకు ఢీల్లీకి చెందిన 20 ఏళ్ల ఎథికల్  హ్యాకర్ అదితి సింగ్  30,000 డాలర్ల ( సుమారు రూ .22 లక్షలు) బహుమతిని గెలుచుకుంది.

రెండు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో ఇలాంటి బగ్‌ను కనుగొని 7500 డాలర్లు (సుమారు రూ .5.5 లక్షలకు పైగా) గెలుచుకున్న అదితి సింగ్ రెండు కంపెనీలకు రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ (ఆర్‌సిఇ) బగ్ ఉందని, ఇది చాలా కొత్తది ఇంకా ఇటువంటి బగ్స్ ద్వారా హ్యాకర్లు సులువుగా ఇంటర్నల్ సిస్టంలోకి ప్రవేశించి అందులోని సమాచారాన్ని పొందగలరని గుర్తించింది. 

ఇలాంటి బగ్స్ గుర్తించడం అంత సులభం కాదని, ఎథికల్ హ్యాకర్లు కొత్త బగ్స్ గురించి వారి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపింది. డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టడం కంటే, మొదట నాలెడ్జ్ పొందడం, ఎథికల్ హ్యాకింగ్ గురించి నేర్చుకోవడంపై కూడా ఆమె నొక్కి చెప్పారు.

"నేను రెండు నెలల క్రితం గుర్తించిన బగ్‌ను మాత్రమే మైక్రోసాఫ్ట్ పరిష్కరించింది. కానీ అన్నింటినీ కాదు, ”అని ఆర్‌సిఇ బగ్‌ను గుర్తించిన మొదటి వ్యక్తి అధితి సింగ్ చెప్పింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్  ఎవరైనా ఇన్ సెక్యుర్  వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకున్నార లేదా అని నిర్ధారించున్నాక బగ్‌ ఉన్న ప్రోగ్రాంను  సరిచేసినట్లు తెలిపింది.

also read జూలై 1 నుండి ఎటిఎం, చెక్ బుక్ నుండి గ్యాస్ సిలిండర్ వరకు మారనున్న 8 రూల్స్ ఇవే..

 సైబర్‌ నేరగాళ్ల  భారీ నుంచి తప్పించుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ ప్రోగ్రాంలను అప్‌డేట్‌ చేస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిలో కొన్ని లోపాలు ఉంటుంటాయి. అలాంటి వాటిని ముందుగా కనిపెట్టి తమ దృష్టి తీసుకొచ్చిన వారికి కంపెనీలు నగదు బహుమతి అందజేస్తుంటాయి. 

ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌లో కనిపించిన RCE బగ్ గురించి అధితి సింగ్ మాట్లాడుతూ  డెవలపర్లు మొదట ఎన్‌పీఏ (నోడ్‌ ప్యాకేజ్‌ మేనేజర్‌)ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే కోడ్ రాయాలని సూచించింది.  

అదితి సింగ్ గత రెండేళ్లుగా ఎథికల్ హ్యాకింగ్‌లో ఉంది. ఆమె మొదట  వైఫై పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేసింది, అప్పటినుండి వెనక్కి తిరిగి చూడ లేదు. "నేను కోటాలో నా మెడికల్ ఎంట్రెన్స్  నీట్ కోసం సిద్ధమవుతున్నప్పుడు ఎథికల్ హ్యాకింగ్ పట్ల ఆసక్తి కలిగింది" అని అదితి చెప్పారు.

"ఇక నేను మెడికల్ కాలేజ్ లో చేరలేదు, కాని ఫేస్‌బుక్, టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్, మొజిల్లా, పేటిఎమ్, ఎథెరియం, హెచ్‌పి వంటి 40 కంపెనీలలో బగ్స్ కనుగొన్నాను." అని తెలిపింది. ఆమెకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,  గూగుల్ హాల్ ఆఫ్ ఫేమ్‌ నుండి కూడా అప్రెసియేషన్ లెటర్ పొందింది.

"టిక్‌టాక్  ఫర్ గాట్ పాస్‌వర్డ్ విభాగంలో నేను ఓ‌టి‌పి బైపాస్ బగ్‌ను నివేదించిన తరువాత  1100 డాలర్లను గెలుచుకున్న నేను ఎథికల్ హ్యాకింగ్‌లోకి ప్రవేశించాలనుకున్నాను" అని చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios