జూలై 1 నుండి ఎటిఎం, చెక్ బుక్ నుండి గ్యాస్ సిలిండర్ వరకు మారనున్న 8 రూల్స్ ఇవే..
వచ్చే నెల నుండి అంటే జులై నుండి భారతదేశంలో కొన్ని పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవచ్చు. ఒకవైపు ఈ కొత్త నిబంధనల నుండి మీకు ఉపశమనం, మరోవైపు కొన్ని విషయాలలో జాగ్రత్తగా వహించకపోతే ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు. ఈ నియమాలలో మార్పులు మీ ఆదాయంపై ప్రభావితం చేస్తాయి. అందువల్ల మీరు వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఈ మార్పులలో ఎల్‌పిజి సిలిండర్ల ధర, ఆరవ పే కమిషన్ సిఫార్సులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే నగదు ఉపసంహరణ సౌకర్యం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఐడిబిఐ బ్యాంక్ అందించే ఉచిత చెక్ సౌకర్యం, ప్రొఫెషనల్ పరిహార విధానంపై ఐఆర్‌డిఎ మార్గదర్శకాలు, వాహన ధరలు, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ ఆఫ్ సిండికేట్ బ్యాంక్, మొదలైనవి ఉన్నాయి..
1.గ్యాస్ సిలిండర్ల ధర
చమురు కంపెనీలు ప్రతి నెల ప్రారంభంలో ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. దేశంలో ఎల్‌పిజి సిలిండర్ల ధర 1 జూలై 2021 నుంచి మారుతుంది. అయితే పన్ను ఆధారంగా ప్రతి రాష్ట్రానికి ఎల్పిజి ధరలు తదనుగుణంగా మారుతూ ఉంటాయి. దీని ధర సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్, విదేశీ మారక రేట్ల మార్పు వంటి అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది.
నగదు ఉపసంహరణ సౌకర్యం
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) వినియోగదారులను షాకింగ్ న్యూస్ తెలిపింది. 1 జూలై 2021 నుండి ఎస్‌బిఐ కొత్త సర్వీస్ ఛార్జీలను అమలు చేయనుంది. జూలై 1 నుండి సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు బ్యాంకు శాఖ నుండి లేదా ఎటిఎం నుండి నాలుగుసార్లు మాత్రమే డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యం అందించింది. కస్టమర్ నాలుగు కంటే ఎక్కువ ఉపసంహరణలు చేస్తే బ్యాంక్ దానిపై ఛార్జీలని విధిస్తుంది. బ్రాంచ్ ఛానల్ వద్ద లేదా ఎటిఎం వద్ద జీఎస్టీతో కలిపి నగదు ఉపసంహరణకు రూ.15 వసూలు చేయబడుతుంది. ఎస్‌బిఐ ఎటిఎంలు కాకుండా ఇతర బ్యాంకుల ఎటిఎంల నుండి ఉపసంహరణకు కూడా ఇదే ఛార్జీ వర్తిస్తుంది.
చెక్కులను ఉపయోగించడం
ఎస్‌బిఐ బ్యాంక్ ఆర్థిక సంవత్సరంలో 10 చెక్కులను సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఉచితంగా ఇస్తుంది. దీని తరువాత 10 చెక్కులు ఉన్న చెక్ బుక్ కోసం మీరు రూ.40 తో పాటు జీఎస్టీ చెల్లించాలి. కాగా 25 చెక్కులతో కూడిన చెక్ బుక్ కోసం వినియోగదారుల నుండి రూ .75తో పాటు జీఎస్టీ వసూలు చేయబడుతుంది. దీనితో పాటు 10 చెక్కుల అత్యవసర చెక్ బుక్ కోసం జీఎస్టీతో పాటు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే సీనియర్ సిటిజన్లకు చెక్‌బుక్‌లపై కొత్త సర్వీస్ ఛార్జీ నుండి మినహాయింపు కల్పించారు.
సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్
కెనరా బ్యాంక్ 1 జూలై 2021 నుండి సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ చెల్లదని వినియోగదారులకు తెలిపింది. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకులో విలీనం అయిన సంగతి మీకు తెలిసిందే, అయితే వినియోగదారులు పాత చెక్ బుక్ ఇంకా ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల పాత చెక్‌బుక్ జూన్ 30 వరకు మాత్రమే చెల్లుతుంది. ఆ తరువాత కస్టమర్ దానిని ఉపయోగించలేరు. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు వెంటనే వారి శాఖకు వెళ్లి దీనిని అప్ డేట్ చేసుకోవాలి. SYNBతో ప్రారంభమయ్యే అన్ని IFSC కోడ్‌లు జూలై 1 నుండి పనిచేయవని కెనరా బ్యాంక్ తెలిపింది.
మారుతి అండ్ హీరో మోటోకార్ప్ వాహనాల ధరలు
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జూలై 1 నుండి వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ పెరుగుదలకు కారణం ఉక్కు, ప్లాస్టిక్, అల్యూమినియం ధరల పెరగటమే అని తెలిపింది. అంతేకాకుండా హీరో మోటోకార్ప్ కూడా జూలై 1 నుండి బైకులు, స్కూటర్ల ధరలను పెంచబోతోంది. హీరో ఈ చర్య తరువాత ఇతర ద్విచక్ర వాహన తయారీదారులు కూడా త్వరలో వాహనాల ధరలను పెంచవచ్చు. హీరో మోటోకార్ప్ జూలై 1 నుంచి స్కూటర్లు, బైక్‌ల ధరలను రూ .3000 వరకు పెంచుతుందని కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఐడిబిఐ కస్టమర్లకు జూలై 1 నుంచి ప్రతి సంవత్సరం 20 పేజీల చెక్ బుక్ మాత్రమే ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాత వినియోగదారులు పొందే ప్రతి చెక్ బుక్ లోని ఒక్క పేజీకి రూ .5 చెల్లించాలి. ఇప్పటి వరకు బ్యాంక్ కస్టమర్లు ఖాతా తెరిచిన మొదటి సంవత్సరంలో 60 పేజీల చెక్ బుక్‌ను ఉచితంగా పొందేవారు. తరువాతి బ్యాంక్ 50 పేజీల చెక్ బుక్ అందించింది.