Asianet News TeluguAsianet News Telugu

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది: డెలాయిట్ సంచలన నివేదిక ..

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వచ్చే 20 ఏళ్లలో భారత్ 8-9 శాతం వృద్ధి చెందాలని డెలాయిట్ సౌత్ ఏషియా సీఈవో రోమల్ శెట్టి తెలిపారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ నివేదిక విడుదల చేయడం విశేషం.  

India to become developed nation by 2047 Deloitte sensational report MKA
Author
First Published Sep 8, 2023, 5:41 PM IST

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, అయితే ప్రతి సంవత్సరం 8-9% వృద్ధి అవసరమని డెలాయిట్ సంస్థ అంచనా వేసింది.   ఇండియా గ్రోత్ అవుట్‌లుక్ పేరిట విడుదల చేసిన నివేదికలో పలు కీలక అంశాలను డెలాయిట్ వివరించింది. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, వచ్చే 20 ఏళ్లలో భారత్ కనీసం 8-9 శాతం వృద్ధి చెందాలని సూచన చేసింది. ఈ విషయాన్ని డెలాయిట్ సౌత్ ఏషియా సీఈవో రోమల్ శెట్టి తెలిపారు. 

ఇదిలా ఉంటే అమృత కాలంలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా 'చైనా ప్లస్ వన్' వ్యూహం నుండి భారతదేశం ప్రయోజనం పొందగలదని, ఇక్కడ అందుబాటులో ఉన్న కార్యకలాపాల స్థాయి, పరిమాణాన్ని మరే ఇతర దేశం అందుకోలేని స్థాయిలో ఉందని శెట్టి అన్నారు.

2040 నాటికి 100 బిలియన్ US డాలర్ల పెట్టుబడి!
భారత అంతరిక్ష రంగంలో ఇప్పటికే 200 స్టార్టప్‌లు ఉన్నాయని, 2040 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని చెప్పారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలంటే, 2047 వరకు కనీసం 8-9 శాతం వృద్ధి సాధించాలని డెలాయిట్ సౌత్ ఏషియా రోమల్ శెట్టి వార్తా సంస్థతో అన్నారు. మధ్య ఆదాయ స్థాయికి మించి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వేగంతో వృద్ధి పెరగడం అంత సులభం కాదు. ప్రపంచంలో 8-9 శాతం వృద్ధిని సాధించగల దేశాలు చాలా తక్కువ అని ఆయన అన్నారు. 

సమీప భవిష్యత్తులో భారత్ టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని మోదీ ఇటీవల ఓ వార్తా సంస్థతో అన్నారు. 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలవడం ఖాయమని ఆయన అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ మరింత సమగ్రంగా మారుతుందని,  ప్రస్తుతం, అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది: డెలాయిట్
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వచ్చే 20 ఏళ్లలో భారత్ 8-9 శాతం వృద్ధి చెందాలి. ఈ విషయాన్ని డెలాయిట్ సౌత్ ఏషియా సీఈవో రోమల్ శెట్టి తెలిపారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడం గమనార్హం. 'చైనా ప్లస్ వన్' వ్యూహం నుండి భారతదేశం ప్రయోజనం పొందగలదని, ఇక్కడ అందుబాటులో ఉన్న కార్యకలాపాల స్థాయి, పరిమాణాన్ని మరే ఇతర దేశం అందించలేదని శెట్టి అన్నారు.

ఈ రంగాల్లో భారత్‌కు అవకాశాలు ఉన్నాయి
వ్యవసాయం, ఏరోస్పేస్, సెమీకండక్టర్, EV వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాలలో భారతదేశం అవకాశాలను అన్వేషించగలదని శెట్టి చెప్పారు. దేశంలో ప్రతీ ఏటా 16,000-18,000 కి.మీ రోడ్లను నిర్మిస్తోందని దీని వల్ల వృద్ధి, వాణిజ్యం పెరుగుతుందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios