Asianet News TeluguAsianet News Telugu

India–Israel Relations: భారత్, ఇజ్రాయెల్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం, CSIR- ఇజ్రాయెల్ DDR&D మధ్య ఎంవోయూ

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇజ్రాయెల్ డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (DDR&D) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం సెమీకండక్టర్స్, సింథటిక్ బయాలజీ మొదలైన హై టెక్నాలజీ రంగాలలో సహకారం కోసం భారతదేశం - ఇజ్రాయెల్ కలిసి పనిచేయనున్నాయి.

India Israel Relations Historic Agreement between India Israel MoU between CSIR Israel DDR MKA
Author
First Published May 4, 2023, 2:08 PM IST

భారతదేశం - ఇజ్రాయెల్ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయి నమోదు అయ్యింది. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MoST) ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), ఇజ్రాయెల్ కుచెందిన  డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (DDR&D) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది

ఈ సందర్భంగా  CSIR  సెక్రటరీ, డాక్టర్ N కళైసెల్వి సహా పలువురు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భవిష్యత్తులో CSIR దృష్టి సారించ బోయే పనులను సైతం అందరి ముందు ఉంచారు.  ముఖ్యంగా ఇజ్రాయెల్‌తో ఏరోస్పేస్, హెల్త్‌కేర్, ఎనర్జీలో కొనసాగుతున్న సహకారాన్ని కూడా ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం  సెమీకండక్టర్స్, సింథటిక్ బయాలజీ మొదలైన అత్యున్నత సాంకేతిక రంగాలలో ఇజ్రాయెల్‌ కలిసి చేయబోయే ప్రాజెక్టుల్లో సహకారాన్ని స్వాగతించారు.

ఇజ్రాయెల్ కు చెందిన  డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ DDR&D హెడ్ డా. డేనియల్ గోల్డ్ మాట్లాడుతూ.. CSIR-DDR&D సంయుక్త సహకారం రెండు దేశాల సంక్షేమానికి ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కారణంగా పలు స్టార్టప్‌ కంపెనీలు, వెంచర్ క్యాపిటలిస్ట్ ల సహకారం లభిస్తుందని ఆయన తెలిపారు. AI ఫోటోనిక్స్ రంగంలో ఇజ్రాయెల్ బలం వల్ల  ఇరుదేశాల్లో మెరుగైన భవిష్యత్తు నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ ఈ సందర్భంగా ఇజ్రాయెల్ - భారతదేశం మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలను నొక్కిచెప్పారు. 2018లో రెండు దేశాలు. ప్రస్తుత CSIR-DDR&D సహకారం భారతదేశం-ఇజ్రాయెల్ సంబంధాలకు ఒక మైలురాయిగా అభివర్ణించారు. భారత ప్రభుత్వ సైన్స్ అంట్ టెక్నాలజీ మంత్రి  CSIR సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో CSIR-DDR&D ఎంఓయూపై డాక్టర్ ఎన్ కలైసెల్వి,  డాక్టర్ డానియల్ గోల్డ్ ఈ సందర్భంగా సంతకం చేశారు.

 భారత్ ఇజ్రాయెల్ మధ్య పారిశ్రామిక సాంకేతిక రంగాలలో, R&D పరిశోధనలో సహకారాన్ని ఈ MOU అనుమతిస్తుంది. ఈ సహకారం హెల్త్‌కేర్‌తో సహా కొన్ని కీలక పారిశ్రామిక రంగాలలో ఉంటుంది.  ఏరోస్పేస్ & ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్స్, ఎనర్జీ, ఎర్త్ & ఓషన్ సైన్సెస్  వాటర్; మైనింగ్, మినరల్స్, మెటల్స్ & మెటీరియల్స్; వ్యవసాయం, పోషకాహారం & బయోటెక్నాలజీ. రంగాల్లో ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios