లాక్డౌన్ తర్వాతే కొత్త కొలువుల జోరు:తాజా సర్వే
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర ఉపాథి రేటు సర్వే చేపట్టిన 15 ఏళ్ల కనిష్ట స్ధాయిలో 5 శాతంగా ఉందని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే వెల్లడించింది. సానుకూల హైరింగ్ ట్రెండ్‌ను కనబరిచిన 44 దేశాల్లో భారత్ టాప్ నాల్గవ స్ధానంలో ఉండటం మాత్రం ఊరట కలిగిస్తోంది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల భారత్‌లో జాబ్ మార్కెట్ కుదేలైంది. వచ్చే మూడు నెలల్లో కేవలం ఐదు శాతం కంపెనీలే నూతన ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించగా, పలు కార్పొరేట్ కంపెనీలు లాక్డౌన్ పూర్తిగా ముగిసేవరకూ వేచిచూసే ధోరణిని కనబరుస్తున్నాయని తాజా సర్వే వెల్లడించింది.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర ఉపాథి రేటు సర్వే చేపట్టిన 15 ఏళ్ల కనిష్ట స్ధాయిలో 5 శాతంగా ఉందని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే వెల్లడించింది. సానుకూల హైరింగ్ ట్రెండ్‌ను కనబరిచిన 44 దేశాల్లో భారత్ టాప్ నాల్గవ స్ధానంలో ఉండటం మాత్రం ఊరట కలిగిస్తోంది.
జపాన్, చైనా, తైవాన్లలో చైనా 11శాతం, మిగతా మూడు దేశాల్లో మాత్రం మూడు శాతం సానుకూల హైరింగ్ ధోరణులతో తొలి 3 స్ధానాల్లో నిలిచాయి. ఆర్థిక మందగమనం, మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కార్పొరేట్ ఇండియా ఉద్యోగుల నియామకాల్లో హేతుబద్ధంగా వ్యవహరిస్తోంది.
లాక్డౌన్ పూర్తిగా తొలగిన అనంతరం డిమాండ్ పెరిగే క్రమంలో నియామకాలు ఊపందుకునేలా వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తోందని మ్యాన్‌పవర్‌గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ చెప్పారు.
also read లాక్డౌన్ తర్వాత ఖర్చులకు రాంరాం.. షాపింగ్‌లకు దూరందూరం..
భారత్‌లో ఆశావహ దృక్పథం నెలకొందని, ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ పలు రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉద్యోగార్థుల ఆశలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
మైనింగ్, నిర్మాణ, బీమా, రియల్ ఎస్టేట్ రంగాల్లో జాబ్ మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. మధ్యతరహా సంస్ధల్లో హైరింగ్ అధికంగా ఉంటుందని ఆ తర్వాత భారీ, చిన్నతరహా సంస్ధలు నియామకాలకు మొగ్గుచూపుతాయని అంచనా వేశారు. లాక్డౌన్ సమయంలో టెక్నాలజీ నూతన ఒరవడికి దారితీసిందని అన్నారు.
మైనింగ్, నిర్మాణ రంగంలో నికరంగా 12 శాతం ఉద్యోగుల నియామకం కోసం ఆసక్తిగా ఉన్నాయి. ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో 9 శాతం, రియాల్టీ రంగంలో ఆరు శాతం నియామకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రవాణా, విద్యారంగం, సేవల రంగం, హోల్ సేల్ అండ్ రిటైల్ ట్రేడ్ రంగాల్లోనూ నియామకాలు జరుగనున్నాయి. ఉత్పాదక రంగంలో మాత్రం రెండు శాతం మాత్రమే నియామకానికి ప్రయత్నిస్తున్నాయి.