Asianet News TeluguAsianet News Telugu

తగ్గుతున్న ఐటీ రిటర్న్స్: నోట్ బందీ ఇలా ఫస్ట్ టైం

గతంతో పోలిస్తే తగ్గిన ఐటీ ఈ-ఫైలింగ్ దాఖలు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19లో 6.6 లక్షల మంది ఈ- ఫైలింగ్ తగ్గిందని నివేదిక వివరించింది. 
 

Income tax e-filers drop by over 6.6 lakh in FY19: Official data
Author
New Delhi, First Published May 6, 2019, 11:25 AM IST

న్యూఢిల్లీ: రికార్డు స్థాయికి చేరుకున్న ఈ-ఫైలింగ్ ద్వారా ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.68 కోట్ల మంది దాఖలు చేశారు. 2017-18లో దాఖలు చేసిన 6.74 కోట్లతో పోలిస్తే 6.6 లక్షల మంది తగ్గినట్లు ఓ నివేదిక తెలిపింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న వారి సంఖ్య జెట్ స్పీడ్ వేగంతో పెరిగింది. కానీ, 2018-19లో మాత్రం తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 5.28 కోట్ల మంది ఈ-ఫైలింగ్ చేశారు.

ఆదాయం పన్ను ఈ-ఫైలింగ్ చేసేవారి సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆశ్చర్యానికి గురి చేసిందని గత నెల చివర్లో కొటక్ ఎకనమిక్ రీసర్చ్ వెల్లడించింది. పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నాటి నుంచి భారీగా పెరిగిన ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య మరింత పెరుగుతారననుకున్నా.. తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని తెలిపింది. 

పన్ను రిటర్నులు తగ్గడం అంటే, కార్యాచరణ బలహీనంగా ఉందనే అభిప్రాయాన్ని కోటక్‌ నివేదిక వ్యక్తం చేసింది. ఎన్నికల అనంతరం బాధ్యతలు స్వీకరించే కొత్త ప్రభుత్వం, ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను రిటర్నులతోపాటు పన్ను చెల్లింపులు కూడా పెరిగేందుకు కృషి చేస్తుందనే అభిప్రాయ పడింది.

పెద్దనోట్ల రద్దు సమయంలో చేసిన అధికమొత్తం డిపాజిట్ల వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తే, మంచి ఫలితాలు రావచ్చని పేర్కొంది. పన్ను చెల్లింపుదార్ల సంఖ్య కనుక పెరగకపోతే, మధ్య కాలానికి వృద్ధిరేటు ఇబ్బందుల్లో పడుతుందనే అంచనాను వ్యక్తం చేసింది.

అయినారిజిస్టార్ ఫైలర్లు మాత్రం 15 శాతం పెరిగి 8.45 కోట్లకు చేరుకున్నట్లు ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ తెలిపింది. 2013 మార్చిలో 2.7 కోట్లుగా ఉన్న ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు కేవలం మూడేండ్లలో రెండింతలు పెరిగి 5.2 కోట్లకు చేరుకున్నారు.

ఆ మరుసటి ఏడాది మార్చి నాటికి మరో కోటి మంది పెరిగి 6.2 కోట్లకు చేరారు. పన్నుల పరిధిని మరింత విస్తరించడానికి నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 

2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఆదాయం కల 1.05 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేయగా, వీరిలో 1.02 కోట్ల మంది వ్యక్తిగతంగా పన్ను దాఖలు చేసేవారు ఉండటం గమనార్హం.

ఫిర్యాదులు తగ్గుముఖం పట్టడం, నూతన ప్రభుత్వం కూడా ఫైలింగ్, పన్నుల వసూళ్లను పెంచడానికి పెద్దపీట వేసే అవకాశం ఉన్నది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నారని, ఇది భవిష్యత్‌లోనూ కొనసాగే అవకాశం ఉన్నదని నివేదిక అభిప్రాయపడింది. ఒకవేళ ఈ ఏడాది కూడా దేశ ఆర్థిక వృద్ధి నిరాశాజనక పనితీరు కనబరిస్తే మాత్రం పన్నుల వసూళ్లు తగ్గనున్నాయని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios