Asianet News TeluguAsianet News Telugu

వైద్యులు, టేకీలదే అత్యధిక సంపాదన,వారి వేతనాలెంతో తెలుసా?

బాగా ఎక్కువ ఆదాయం అభించే ఉద్యోగాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నగరాల్లో లభించే సగటు వేతనాలు, అక్కడి ఉద్యోగాల గురించి తెలుసుకోవాలనుందా? ఏ నగరాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయో అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని భావిస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం అర్జంటుగా ఈ కింది స్టోరీ చదవండి.
 

In 2018, specialist doctors, techies top pay charts

బాగా ఎక్కువ ఆదాయం అభించే ఉద్యోగాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నగరాల్లో లభించే సగటు వేతనాలు, అక్కడి ఉద్యోగాల గురించి తెలుసుకోవాలనుందా? ఏ నగరాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయో అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని భావిస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం అర్జంటుగా ఈ కింది స్టోరీ చదవండి.

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల్లో, నగరాల్లో లభిస్తున్న సగటు వేతనాలపై సాలరీ ట్రెండ్స్ 2018 పేరిట ర్యాండ్ స్టాండ్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన 20 రకాల ఇండస్ట్రీలపై, 15 రకాల విధులపై,  1 లక్ష ఉద్యోగాలపై ఈ సంస్థ పరిశోధన జరిపి ఆసక్తికరమైన విషయాలను బైట పెట్టింది.

వివిధ రంగాల వారిగా చూసుకుంటే వైద్య రంగంలో అత్యధిక సగటు వేతనాలు లభిస్తున్నట్లు ఈ సంస్థ సర్వేలో తేలింది.  వైద్యులతో పాటు, వైద్య రంగంలో ఉన్నవారికి అత్యధిక సగటు వార్షిక వేతనం రూ.9.6 లక్షల వేతనాలు లభిస్తున్నట్లు తెలిపింది. స్పెషలిస్ట్ డాక్టర్లకు, వైద్య రంగంలో రీసెర్చ్ డెవలప్ మెంట్ స్కిల్స్ ఉన్న ఉద్యోగులకుకి  బాగా డిమాండ్ ఉండటంతో ఇంత పెద్ద మొత్తంలో  జీతాలు లభిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇలా వైద్య రంగం ఈ సర్వేలో టాప్ ర్యాంకును సాధించింది.  

ఇక మేనేజ్ మెంట్ కన్సల్టింగ్, స్ట్రాటజీ, అకౌంటింగ్, మరియు ఆడిటింగ్ రంగాల్లోని ఉద్యోగులు సగటున రూ. 9.4 లక్షల వార్షిక వేతనం  లభిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ, ఎఫ్ ఎమ్ సి జి ల వల్ల ఈ రంగాలకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ రంగం టాప్  ర్యాంకు సాధించింది. 

వ్యక్తిగత ఉద్యోగాల విషయానికి వస్తే స్పెషలిస్ట్ డాక్టర్లకు సగటు వార్షిక వేతనం రూ.18.4 లక్షలు లభిస్తోంది. వైద్య రంగంలో వారికున్న అనుభవాన్ని బట్టి ఇంతకంటే ఎక్కువ వేతనాలను పొందుతున్న డాక్టర్లు ఉన్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి. దీంతో వ్యక్తిగత సగటు వేతనాల విషయంలో స్పెషలిస్ట్ డాక్టర్లు ముందు వరుసలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో టెకీలు ఉన్నారు. సాప్ట్ వేర్ రంగంలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లకు రూ.15.1 లక్షలు , ప్రోడక్ట్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ లకు 14.8 లక్షలు,  మరియు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎక్స్ పర్ట్స్ కి రూ.14.6 లక్షలు వ్యక్తిగత సగటు వేతనం లభిస్తున్నాయి.

ఇక వివిధ నగరాల్లో లభిస్తున్న సగటు వేతనాలపై కూడా ఈ సర్వే జరిగింది.  ఉద్యోగుల సామర్థ్యం, టాలెంట్, అనుభవాన్ని బట్టి బెంగళూరులో పనిచేసే ఉద్యోగులకు సగటు వార్షిక వేతనం రూ. 10.8 లక్షలుగా ఉంది. ఆ తర్వాత పుణే రూ. 10.3 లక్షలు,డిల్లీ రూ.9.9 లక్షలు, ముంబై రూ.9.2 లక్షలు, చెన్నై రూ.8 లక్షల సగటు వేతనాన్ని అందిస్తున్నాయి. ఇందులో 2017 సంవత్సరంలో కూడా బెంగళూరు నగరమే టాప్ లో ఉండటం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios