దాదాపు ప్రతి దేశ వృద్ధి రేటు మందగిస్తున్నప్పటికీ, ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం మెరుగ్గా ఉందని శ్రీనివాసన్ చెప్పారు. ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి అంచనాను 8.7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఉన్నతాధికారి మంగళవారం మాట్లాడుతూ ఆర్థిక వృద్ధిలో ప్రపంచం మొత్తం వెనుకబడి ఉండగా, భారతదేశం పై ఈ ప్రభావం పడలేదని, కానీ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉందని అన్నారు.

ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులను పరిశీలిస్తే.. ద్రవ్యోల్బణంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో వృద్ధి మందగించిన సంగతి తెలిసిందే అని అన్నారు. 

ఒక వార్తా సంస్థతో శ్రీనివాసన్ మాట్లాడుతూ, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు వాటా ఉన్న దేశాలు ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది మాంద్యంలోకి వస్తాయని మేము భావిస్తున్నాము అని అన్నారు.

దాదాపు ప్రతి దేశ వృద్ధి రేటు మందగిస్తున్నప్పటికీ, ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం మెరుగ్గా ఉందని శ్రీనివాసన్ చెప్పారు. 

ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి అంచనాను 8.7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది.

2023 సంవత్సరానికి ప్రపంచ వృద్ధి రేటు 6.1 శాతంగా అంచనా వేసింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది మాంద్యాన్ని చూడవచ్చు. ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, చైనాలను కూడా ప్రభావితం చేస్తుంది.

"డిజిటలైజేషన్‌లో భారతదేశం అద్భుతంగా పని చేసిందని, భారత జనాభాలో దాదాపు 70 శాతం మందికి పూర్తిగా టీకాలు వేయబడ్డాయి. 1.4 బిలియన్ల జనాభా ఉన్న దేశానికి టీకాలు వేయడం అంటే అంత తేలికైన పని కాదు. ఉపాధికి మద్దతుగా వనరులను ఉపయోగించడంలో చాలా తెలివిగా వ్యవహరించారు "అని శ్రీనివాసన్ అన్నారు.