బోగస్ పేర్లతో కాంట్రాక్టులు:వెలుగులోకి 33వేల కోట్ల హవాలా రాకెట్‌

పలు కార్పొరేట్ సంస్థలు బోగస్ పేర్లతో కాంట్రాక్టులు పొందుతూ హవాలా లావాదేవీలు జరిపినట్లు ఐటీ శాఖ దాడుల్లో గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది. ఇలా హవాలా లావాదేవీలు జరిపిన సంస్థలు ఎక్కువగా ఢిల్లీ, ముంబై నగరాల పరిధిలోనే ఉన్నాయని వివరించింది.

I-T department busts Rs 3,300-crore hawala racket involving infrastructure firms

న్యూఢిల్లీ: మౌలిక వసతుల అభివృద్ధి రంగంలో సేవలందిస్తున్న పలు ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలకు చెందిన దాదాపు రూ.3,300 కోట్ల విలువైన హవాలా రాకెట్‌ను ఆదాయం పన్ను శాఖ (ఐటీ) బట్టబయలు చేసింది. ఈ రాకెట్‌లో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై నగరాలకు చెందిన కార్పొరేట్ సంస్థలు విస్తరించి ఉన్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం ప్రకటించింది. 

aslo read జొమాటో కస్టమర్లకు ఫ్రీ వాలెట్ పార్కింగ్......

భారీగా ఆదాయం పన్ను చెల్లింపుల ఎగవేతల విషయమై ఈ నెల మొదటి వారంలో జరిపిన సోదాల్లో ఈ హవాలా రాకెట్‌ బయటపడిందని సీబీడీటీ తెలిపింది. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, ఎరోడ్‌, పుణె, ఆగ్రా, గోవా తదితర నగరాలలో ఈ సోదాలు జరిపామని సీబీడీటీ తెలిపింది.

బోగస్‌ బిల్లులను జారీ చేస్తూ హవాలా లావాదేవీలను జరుపుతున్న ముఠాలను ఈ దాడుల్లో తాము గుర్తించినట్లు తెలిపింది. ఈ సోదాల్లో తమకు విలువైన సమాచారంతో పాటు హవాలా లావాదేవీలకు సంబంధించిన బలమైన ఆధారాలు లభించాయని సీబీడీటీ తెలిపింది. ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్థలు ఏ విధంగా తమ వద్ద ఉన్న బ్లాక్‌మనీని హవాలా రూపంలో మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

I-T department busts Rs 3,300-crore hawala racket involving infrastructure firms

ఇందులో ఏఏ వర్గాల వారు పాలుపంచుకుంటున్నది కూడా తమ సోదాల్లో వెల్లడైందని సీబీడీటీ వెల్లడించింది. బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా హవాలా లావాదేవీలు జరుగుతుండడం గమనించి పక్కా ఆధారాలతో తాము ఈ దాడులు నిర్వహించామని సీబీడీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

aslo read రీసైక్లింగ్ కోసం 78 టన్నుల ప్లాస్టిక్ : రిలయన్స్ రికార్డ్

ఈ హవాలా లావాదేవీల్లో పాలు పంచుకుంటున్న సంస్థలు ఎక్కవగా జాతీయ రాజధాని ప్రాంతం, ముంబై నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు తమ విశ్లేషణలో తేలిందని పేర్కొంది. ఈ హవాలా రాకెట్‌లో పాల్గొన్న సంస్థల పేర్లను మాత్రం సీబీడీటీ బయటకు వెల్లడించలేదు.

బోగస్‌ బిల్లులను జారీ చేస్తున్న సంస్థల్లో అత్యధికం దక్షిణ భారతలోనే నెలకొనగా తమ విచారణలో వెలుగులోకి వచ్చిందని.. ఆయా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీబీడీసీ తెలిపింది. ఈ దాడుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తికి రూ.150 కోట్లకు పైగా చెల్లింపులు జరిగిన విషయం వెలుగులోకి వచ్చిందని సీబీడీటీ తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios