హెంజెన్: చైనా టెలికం దిగ్గజం హువామే తన ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. సంస్థ వ్యాపారంపై అమెరికా నిషేధం విధించినా హువావే తన సిబ్బందికి 2 బిలియన్ యువాన్ల (286 మిలియన్ డాలర్ల) నిధులను నగదు రూపంలో పంచబోతున్నది. 

అమెరికా ఒత్తిడి నేపథ్యంలో ఉద్యోగులు చేసిన పనికి గుర్తింపుగా ఇది ఉంటుందని  హువావే మానవ వనరుల విభాగం  కంపెనీ సిబ్బందికి ఇచ్చిన నోటీసులో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో పని చేస్తున్న 1.9 లక్షల మందికి గత  నెలకు వేతనాన్ని రెండింతలు అందించ బోతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

aslo read అమెజాన్ బంపర్ ఆఫర్ :20వేల విలువైన ఫోన్ 10వేలకే...

ఆర్ అండ్ డీ(పరిశోధన, డెవలప్‌మెంట్) విభాగంలో పని చేస్తున్న సిబ్బందికి హువావే నగదు రివార్డును అందచేయబోతున్నట్లు స్థానిక  సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ప్రపంచంలో టెలికం పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన హువావేపై అమెరికాలో నిషేధం విధించడంతో ప్రత్నామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించింది. 

aslo read  బోగస్ పేర్లతో కాంట్రాక్టులు:వెలుగులోకి 33వేల కోట్ల హవాలా రాకెట్‌

ఇందులో భాగంగానే హువావే తన సిబ్బందిపై వరాల జల్లు కురిపించినట్లు తెలుస్తున్నది. కంపెనీకి చెందిన 5జీ నెట్‌వర్కింగ్‌కు సంబంధించి పరికరాలు భద్రత ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని ఆరోపిస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ హువావే ఉత్పత్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

తద్వారా ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం పరికరాల ప్రొవైడర్ హువావే, అమెరికాలో హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 
ఈ ఏడాది మే నెలలో అమెరికన్ సంస్థలతో వ్యాపారం చేయకుండా నిషేధించిన తర్వాత చైనా కంపెనీ ఉద్యోగులకు ఈ నగదు  బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది.