మీరు ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నారా..? అంతకంటే ముందు డబ్బును ఆదా చేసేందుకు  ట్యాక్స్ సేవింగ్స్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? లేదంటే  భౌతిక పరమైన ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఉదాహరణకు ఇల్లు, కార్లు రకరకలా మార్గాలు ఉన్నాయి. వాటిలో భౌతికపరమైన ఆస్తుల కంటే ఎక్కువ ఆదాయాన్ని గడించేందుకు ఆర్ధికపరమైన ఆస్తులు ఉన్నాయని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.  

ఉదాహరణకు పాలసీలు, మ్యూచవల్ ఫండ్స్,ఫిక్స్ డ్ డిపాజిట్లు ఇలా. ఆర్ధిక పరమైన ఆస్తుల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయడం ద్వారా పెద్దమొత్తంలో ఆదా చేసుకునే అవకాశం ఉంది.మన ఆర్ధికపరమైన అవసరాలన్నీ తీరిన తరువాత భౌతికపరమైన ఆస్తుల్లో పెట్టుబడిపెట్టాలంటే మనదగ్గర పెద్దమొత్తంలో బడ్జెట్ ఉండాలి. అదే ఫైనాన్షియల్ అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు.  మన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయోచ్చు.

also read రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి కొత్త చిక్కులు....

 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (ఎన్ ఎస్ సీ ), లైఫ్ ఇన్సూరెన్స్, యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్), ఈక్విటీ- లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఇఎల్ఎస్ఎస్), ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డిలు) 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, ఆమోదించిన షేర్లు / డిబెంచర్లు, ఎంప్లాయ్  ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్) మొదలైనవాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బును ఆదా చేయోచ్చు.

కట్టాల్సిన ట్యాక్స్ లో కూడా ఆదాయం గడించేలా ప్లాన్ చేసుకోవచ్చు.  అదెలా అంటారా..? సెక్షన్ 80సీ ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్యాక్స్ పే చేసేవారు ఫైనాన్షియల్ అసెట్స్ లో పెట్టుబడి పెట్టినట్లు క్లయింమ్ చేసుకుంటే సుమారు  రూ.1.5లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.  అంతే కాదు పైన చెప్పిన విధంగా  ఫైనాన్షియల్ ప్లాన్ లో ఇన్మెస్ట్మెంట్ చేస్తే  ఎంత ఆదాయాన్ని గడిస్తున్నామో, నేషల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్ ) అండర్ 80సీసీడీ(1) ద్వారా రూ.1.5లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.  

 చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీజు (ట్యూషన్ ఫీజు మాత్రమే), హౌసింగ్ లోన్ ప్రిన్సిపాల్  అమౌంట్ తిరిగి చెల్లించడం ద్వారా ఫైనాన్షియన్ ఇయర్ లో 1.5లక్షల వరకు లబ్ధి పొందవచ్చు.  టైర్-1 నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద 80 సీసీడీ (1 బి) యాక్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ లో సుమారు రూ.50వేల వరకు ఆదా చేసుకోచ్చు.  

also read ఐసీఐసీఐ బ్యాంక్, మాజీ సీఈఓకి ఈడీ షాక్.​....ఇల్లు, ఆస్తులను....

ఫైనాన్షియల్ ఇయర్ లో  ట్యాక్స్ పే చేస్తున్న దంపతులు పైనాన్షియల్ అసెట్స్ లో  ఇన్వెస్మెంట్ చేయడం ద్వారా రూ.1.5లక్షలు, 80 సీసీడీ (1 బి) యాక్ట్ కింద రూ.50వేలతో సుమారు రూ.2లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.  మనం పే చేసే ట్యాక్స్ లో రూ.2లక్షల వరకు ఆదా చేయాలంటే ఎవరైతే ట్యాక్స్ పేచేస్తున్నారో వారి ఆదాయం సంవ్సరానికి రూ.7లక్షలు ఉండాలి.  

ఆదాయం రూ.7లక్షలు ఉండి, ఎడ్యుకేషనల్ లోన్ రూ.2లక్షలవరకు ఉంటే అన్నీ కలుపుకొని రూ.54,600 ఆదా చేసుకోవచ్చు. రూ. ఆదాయం రూ.5లక్షలకు ఉందంటే ట్యాక్స్ లో రూ.12,500వరకు ఆదా చేసుకోవచ్చు.