కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందే దేశంలో ప్రముఖ వాణిజ్య సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ సామాన్యులకు షాకిచ్చింది.

Also Read:కేంద్ర బడ్జెట్ 2020: రూ. 5 లక్షలలోపు వార్షికాదాయం ఉంటే నో పన్ను

దశల వారీగా సబ్బుల ధరలను 6 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. సబ్బుల తయారీకి ఉపయోగించే ముడిసరుకులకు అధిక వ్యయం అవుతున్న నేపథ్యంలో సబ్బుల ధరలపై ప్రభావం పడినట్లు కంపెనీ తెలిపింది.

హిందుస్థాన్ యూనిలీవర్ ఉత్పత్తుల్లో జనంలో బాగా గుర్తింపు పొందిన డోవ్, లక్స్, లైఫ్‌బాయ్, పియర్స్, హమామ్, లిరిల్, రెక్సోనా వంటి సబ్బులు ఉన్నాయి. వీటిని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 

Also Read:కేంద్ర బడ్జెట్ 2020: ఎల్ఐసీ ప్రైవేటీకరణ దిశగా సర్కార్ అడుగులు

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా రెండో ఏడాది ఆమె బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. అంతకుముందు బడ్జెట్‌కు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.