Asianet News TeluguAsianet News Telugu

హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్.. రూ.28,391కోట్ల నష్టం: రిలయన్స్ టాప్

ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గతవారం అత్యధికంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయింది. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కైజాడ్ భారుచా నియామకాన్ని ఆర్బీఐ ఆమోదించింది. మరోవైపు మొత్తం బ్లూ చిప్ కంపెనీల్లో ఏడు కంపెనీలు మొత్తం రూ.78,127 కోట్లు కోల్పోయాయి.  
 

HDFC Bank's market cap plunges by Rs28,391.71cr; RBI approves re-appointment of Kaizad Bharucha
Author
Hyderabad, First Published Jun 15, 2020, 10:36 AM IST

ముంబై: గతవారం టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో ఏడు కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.78,127 కోట్లు కోల్పోయాయి. దీనిలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ భారీగా నష్టాన్ని చవిచూసింది. పది కంపెనీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), హెచ్డీఎఫ్సీ మాత్రమే లాభపడ్డాయి.

జూన్ 12వ తేదీతో ముగిసిన వారానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,391 కోట్లు తగ్గి రూ.5,39,305 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఖైజాడ్ భరూచా నియామకాన్ని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తిరిగి ఆమోదించిన తర్వాత బ్యాంక్ షేర్ నష్టపోవడం ఆసక్తికర పరిణామం. 

ఆర్బీఐ నిర్ణయంతో హెచ్డీఎఫ్సీ తిరిగి మదుపర్ల నమ్మకాన్ని చూరగొంటుందా? లేదా? వేచి చూడాల్సిందే. బ్యాంక్ సాధారణ వాటాదారుల వార్షిక సమావేశంలో భారుచా నియామకానికి ఆమోదం లభించాల్సి ఉంటుంది.

బీఎస్ఈ లిస్టింగ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.28,391.71 కోట్లు కోల్పోయి రూ.5,95,305.38 కోట్ల వద్ద స్థిరపడింది. అయితే శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి హెచ్డీఎఫ్సీ షేర్ 1.48 శాతం గ్రీన్‍తో స్థిరపడింది. ఇండియన్ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ.13,638 కోట్లు తగ్గి రూ.3,05,456 కోట్లకు చేరింది.

also read అమ్మబాబోయ్!!ప్రైవేట్ బ్యాంకులు వేస్ట్ :ప్రభుత్వ బ్యాంకులే బెస్ట్

మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసిఎపి రూ.11,882 కోట్లు తగ్గి రూ .2,53,197 కోట్లకు పడిపోగా, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,411 కోట్లు తగ్గి రూ.2,22,918 కోట్లు అయింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.7,313 కోట్లు తగ్గి రూ .2,38,469 కోట్లు అయింది. 

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ వాల్యుయేషన్ గత వారం రూ. 4,961.86 కోట్లు తగ్గి రూ.2,94,772 కోట్లకు చేరగా, మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విలువ రూ.3,527 కోట్లు తగ్గి రూ.7,64,998 కోట్లకు చేరుకుంది.

మరోవైపు ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,198 కోట్లు పెరిగి రూ.10,07,204 కోట్లకు చేరుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.4,555 కోట్లు పెరిగి రూ.3,10,486.85 కోట్లకు చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి.

మరో సంస్థ హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ విలువ రూ .4,464.15 కోట్లు పెరిగి రూ .4,94,862.23 కోట్లు అయింది. గత వారాంతం శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 506.35 పాయింట్లు లేదా 1.47 శాతం నష్టపోయింది.

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 10 కంపెనీలలో రిలయన్స్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios