మార్చి 31 తో ముగిసిన2021  త్రైమాసిక ఫలితాలను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ శనివారం ప్రకటించింది. ఈ కాలంలో బ్యాంకు నికర లాభం 18.1 శాతం పెరిగి రూ .8,186.51 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ .6,927.69 కోట్లు.

ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 12.6 శాతం పెరిగి రూ .17,120 కోట్లకు చేరుకుంది. కాగా, 2020 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో  రూ .15,204 కోట్లుగా ఉంది.

క్వార్టర్-ఆన్-క్వార్టర్ ప్రాతిపదికన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గ్రాస్ నాన్ పర్ఫర్మింగ్ అసెట్స్  (ఎన్‌పిఎ) 1.32 శాతం పెరిగి 2021 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికంలో 0.81 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ నికర ఎన్‌పిఎ 0.40 శాతంగా ఉంది.

also read ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీలో సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ పెట్టుబడులు.. ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ ద్వారా వ...

మార్చి 31 నాటికి  బ్యాంక్ డిపాజిట్ బేస్ సుమారు రూ. 13.35 లక్షల కోట్లకు పెరిగిందని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. సంవత్సరానికి, ఇది 16.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.

తక్కువ ఖర్చుతో కూడిన కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు నాలుగో త్రైమాసికంలో 27 శాతం పెరిగి రూ .6.15 లక్షల కోట్లకు చేరుకున్నాయని బ్యాంక్ తెలిపింది.

 అంతకుముందు ట్రేడింగ్ రోజున  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్ 1,434.95 స్థాయిలో ప్రారంభమైన తర్వాత 0.80 పాయింట్లు (0.056 శాతం) పడిపోయి 1,430.90 స్థాయిలో ముగిసింది. ప్రస్తుతం బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .7.87 లక్షల కోట్లు.