Asianet News TeluguAsianet News Telugu

ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీలో సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ పెట్టుబడులు.. ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ ద్వారా వెల్లడి..

స్విగ్గీలో గ్లోబల్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇందుకు రెండు సంస్థల మధ్య చర్చలు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. 

SoftBank looking to bet on food delivary company Swiggy, to invest $450 million
Author
Hyderabad, First Published Apr 17, 2021, 1:28 PM IST

ముంబై / బెంగళూరు:  ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీలో గ్లోబల్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్ ఫండ్  పెట్టుబడులు చేయనుంది. ఇందుకు స్విగ్గీలో సుమారు 450 మిలియన్ డాలర్లు (రూ. 3,348 కోట్లు) పెట్టుబడి పెట్టాలని సాఫ్ట్‌బ్యాంక్  భావిస్తుంది.

సాఫ్ట్‌బ్యాంక్, స్విగ్గీ  మాతృ సంస్థ బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్. లిమిటెడ్ ఈ ఒప్పందం పై తుది చర్చలు జరుపుతోంది. అయితే షేర్ల ఒప్పందంపై ఇంకా సంతకం చేయలేదని దీనికి సంబంధించిన  ఒక వ్యక్తి  చెప్పారు. అలాగే ఈ ఒప్పంద  పత్రాలను ఒకటి లేదా రెండు వారాల్లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) లో దాఖలు చేసే అవకాశం ఉందని  తెలిపారు.

సాఫ్ట్‌బ్యాంక్ ప్రవేశంతో  స్విగ్గి  పోస్ట్-మనీ వాల్యుయేషన్‌ను 5.5 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి.   సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ 500 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టగలదని మరో వ్యక్తి కూడా అభ్యర్థించారు. ఈ విషయంపై  సాఫ్ట్‌బ్యాంక్, స్విగ్గి  అధికారికంగా స్పందించలేదు.

also read  ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా లగ్జరీ బంగ్లా .. 18 కోట్ల ఈ ఇంటి లోపల ఎప్పుడైనా చూసారా.. ...

గత వారం స్విగ్గి, ఒక ఇంటర్నల్ నోట్ లో కొత్త, పాత పెట్టుబడిదారుల కన్సార్టియం నుండి 5 బిలియన్ డాలర్ల పోస్ట్-మనీ వాల్యుయేషన్  (సుమారు 5,863 కోట్లు) సేకరించినట్లు పేర్కొంది. ఇందులో ఫాల్కన్ ఎడ్జ్ కాపిటల్, గోల్డ్మన్ సాచ్స్, థింక్ కాపిటల్, అమన్సా క్యాపిటల్, కార్మిగ్నాక్ కొత్త పెట్టుబడిదారులు.  

కంపెనీ ఉద్యోగుల సీఈవో శ్రీహర్ష మాజేటి ఈ నెల మొదట్లో పంపిన ఈమెయిల్‌ ద్వారా స్విగ్గీ తాజా డీల్‌ వివరాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. కాగా స్విగ్గి,  ప్రత్యర్థి సంస్థ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో స్విగ్గీ డీల్‌ అంశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios