Asianet News TeluguAsianet News Telugu

10వేల కోట్లు దాటిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాలు

 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.10,749 కోట్ల నికార లాభం సాధించింది. కిందటి యేడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.6,097 కోట్లుతో పోల్చితే 76% వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. 

hdfc bank  profits crosses 10 thousand crores
Author
Hyderabad, First Published Nov 5, 2019, 2:59 PM IST

న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంకింగ్ లో ఒకటైన హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి) బ్యాంక్  లాభం పుంజుకుంది. భారత్‌లో అతి పెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనిగా పేరొందిన హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ మంచి లాభాలను పొందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.10,749 కోట్ల నికార లాభం సాధించింది. కిందటి యేడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.6,097 కోట్లుతో పోల్చితే 76% వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. 

గృహ్‌ ఫైనాన్స్‌ బ్యాంక్ లో వాటాల విక్రయం, అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్‌ ఆదాయం బాగా పెరగడం మరియు పన్ను భారం తగ్గడం వల్ల బ్యాంక్ నికార లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. ఆదాయం రూ.22,951 కోట్ల నుంచి రూ.32,851 కోట్లకు పెరిగిందని హెచ్‌డిఎఫ్‌సి  పేర్కొంది.  

aslo read ఐదేళ్లలో 3,427 బ్యాంకుల... మూసివేత...ఎందుకంటే...?

అయితే పన్ను భారం  మాత్రం రూ.1,022 కోట్ల నుంచి రూ.569 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో రూ.6 కోట్లుగా ఉన్న డివిడెండ్‌ ఆదాయం ఈ క్యూ2లో 186 రెట్లు ఎగిసి రూ.1,074 కోట్లకు పెరిగింది. మొత్తంగా 18% రుణ వృద్ధి సాధించామని హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్  తెలిపింది. ఇక నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధితో రూ.3,078 కోట్లకు చేరింది. 

hdfc bank  profits crosses 10 thousand crores

నికర వడ్డీ మార్జిన్‌లో ఎలాంటి మార్పు లేకుండా 3.3 శాతం రేంజ్‌లోనే ఉంది. స్థూల మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా 1.29% నుంచి స్వల్పంగా 1.33%కి పెరిగాయని వివరించింది. కేటాయింపులు గత క్యూ2లో రూ.890 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.754 కోట్లకు తగ్గాయని తెలిపింది.  

also read  దేశంలో ఇంత బంగారం ఉందా!

స్టాండ్‌ అలోన్‌ పరంగా నికర లాభం రూ.2,467 కోట్ల నుంచి 61 శాతం వృద్ధితో రూ.3,962 కోట్లకు చేరుకుంది.  మొత్తం ఆదాయం రూ.11,257 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.13,494 కోట్లకు పెరిగింది. గృహ్‌ ఫైనాన్స్‌ కంపెనీని బంధన్‌ బ్యాంక్‌కు విక్రయించడం వల్ల రూ.1,627 కోట్ల పన్నుకు ముందు లాభాలు వచ్చాయని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios