Asianet News TeluguAsianet News Telugu

హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు కట్టక్కర్లేదు!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం రుణలు తిరిగి చెల్లించెందుకు తాత్కాలిక నిషేధాన్ని ఆగస్టు 31 వరకు అంటే మరో మూడు నెలలు పొడిగించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్  లోన్, క్రెడిట్ కార్డు బకాయిలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ప్రస్తుతం ఈఎంఐ ఇప్పుడు కట్టకపోయినా పర్లేదు. 

HDFC Bank extends loan EMI moratorium till August to their customers
Author
Hyderabad, First Published Jun 3, 2020, 1:29 PM IST

ఆర్‌బిఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లకు ఇఎంఐ మారటోరియం ఫెసిలిటీ అందిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం రుణలు తిరిగి చెల్లించెందుకు తాత్కాలిక నిషేధాన్ని ఆగస్టు 31 వరకు అంటే మరో మూడు నెలలు పొడిగించింది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్  లోన్, క్రెడిట్ కార్డు బకాయిలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ప్రస్తుతం ఈఎంఐ ఇప్పుడు కట్టకపోయినా పర్లేదు. అయితే ఈఎంఐ మారటోరియం ఆప్షన్ ఎంచుకునే వారు మాత్రం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ లోన్ మారటోరియం గడువు ముగిసిన తర్వాత ఎప్పటిలాగే నెలసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

లేదంటే లోన్ గడువు పెరుగుతుంది. అలాగే మారటోరియం గడువులో మీ లోన్ ఔట్ స్టాండింగ్ అమౌంట్‌పై వడ్డీ పడుతుంది.అయితే ఈ మారటోరియం ఆప్షన్ 1 మార్చి 2020 ముందు తీసుకున్న రుణాలకు మాత్రమే వర్తిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది.

also read నిరుద్యోగ రేటు స్ధిరంగా ఉన్నా..కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు...

కాకపోతే  ఏ కస్టమర్‌కు ఈఎంఐ మారటోరియం అందించాలనే అధికారం బ్యాంక్‌కు మాత్రమే ఉంటుంది. బ్యాంక్ తనకు నచ్చిన అర్హత కలిగిన కస్టమర్లకు ఈ ఫెసిలిటీ అందించొచ్చు. వ్యవసాయ రుణాలు, మైక్రోఫైనాన్స్ కస్టమర్లు, కార్పొరేట్ కస్టమర్లు, ఎస్ఎంఈ కస్టమర్లు అందరూ ఈఎంఐ మారటోరియం బెనిఫిట్‌కు అర్హులే. వారు మేనేజర్లతో సంప్రదించి కస్టమర్లు ఈ సౌకర్యం పొందొచ్చు.

మార్చి, ఏప్రిల్, మే నెలలకు మారటోరియం పొందిన కస్టమర్లు మళ్లీ తర్వాతి మూడు నెలలకు ఈఎంఐ మారటోరియం పొందాలంటే కొత్త అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జూన్ నెలకు మారటోరియం కోసం అప్లై చేసుకున్న వారి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే అవి 5 రోజుల్లో మళ్లీ రిఫండ్ అవుతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. మారటోరియం కొత్త అప్లికేషన్ కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి లోన్ మారటోరియం ఆప్షన్ ఎంచుకోవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios