ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వచ్చే ఆరు నెలల్లో సుమారు 20వేల మందిని నియమించుకొనుంది. జనవరి–డిసెంబర్‌ 2020 మధ్యకాలంలో తొలిసారి హెచ్‌సిఎల్ ఆదాయం 10 బిలియన్‌ డాలర్లను అధిగమించినట్లు తెలిపింది.

ప్రజలు డిజిటల్ సేవలను స్వీకరించడం ఇంకా  పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ నియామకాలు ఉన్నట్లు చెప్పారు. హెచ్‌సిఎల్ టెక్ ప్రెసిడెంట్, సిఇఒ సి విజయకుమార్ మాట్లాడుతూ డిజిటల్ సేవలను స్వీకరించడంలో బలమైన వృద్ధి ఉన్నందున డిమాండ్ మరింత  పెరుగుతుందని, ఈ డిమాండ్‌ను తీర్చడానికి వచ్చే నాలుగు-ఆరు నెలల్లో 20వేల మందిని నియమించుకొనున్నట్లు తెలిపారు.

also read డిజిటల్ లోన్‌లు.. బలవుతున్న అమాయకులు: రంగంలోకి ఆర్‌బీఐ

వీరిలో ఫ్రెషర్లు, అనుభవజ్ఞులు ఇద్దరినీ నియమించుకొకున్నారు. అంతేకాకుండా ఇందులో 15 శాతం మంది ఉద్యోగులు విదేశాలలో లేదా క్లయింట్ వైపు ఉద్యోగం పొందుతారు. మూడవ త్రైమాసికంలో 6,500 మందికి పైగా ఉద్యోగులున్నారు.

 హెచ్‌సిఎల్ వంటి చాలా కంపెనీలు వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా స్థానిక ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడంపై దృష్టి పెడుతున్నాయని చెప్పారు. యుఎస్‌లోని కంపెనీ ఉద్యోగులలో 69.8 శాతం మంది స్థానికులే ఉన్నారు. 

డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌సిఎల్ టెక్ నికర లాభం 31.1 శాతం పెరిగి రూ.3,982 కోట్లకు చేరుకుంది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 3,037 కోట్ల రూపాయలు. ఏడాది క్రితం రూ.18,135 కోట్ల నుంచి ఆదాయం 6.4 శాతం పెరిగి రూ .19,302 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది.