Asianet News TeluguAsianet News Telugu

GST 5 Years: నేటితో జీఎస్టీకి 5 ఏళ్లు పూర్తి, సవాళ్ల నుంచి దిగ్విజయం వరకూ ప్రస్థానం..

దేశీయంగా పన్నుల వ్యవస్థను పూర్తి డిజటలైజేషన్ వైపు తరలి వెళ్లేలా, పాత పన్నుల వ్యవస్థ స్థానంలో విప్లవాత్మకమైన మార్పుగా తీసుకొచ్చిన జీఎస్టీ పన్ను వ్యవస్థ నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  అదే సమయంలో, జూన్ నెల జీఎస్టీ కలెక్షన్ డేటా కూడా కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. 

GST has completed 5 years know where are the advantages and what are the disadvantages
Author
Hyderabad, First Published Jul 1, 2022, 6:05 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్‌లో జిఎస్‌టి వసూళ్లు ఏడాది క్రితంతో పోలిస్తే 56% పెరిగి రూ. 1.44 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది ఒక రకంగా రికార్డు అనే చెప్పుకోవాలి. 

అంతకుముందు మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,40,885 కోట్లుగా నమోదు కాగా, క్రితం ఏడాది ప్రాతిపదికన చూస్తే దాదాపు 44 శాతం వృద్ధిని సాధించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత నెలవారీ వసూళ్లు 1.40 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం ఇది ఐదోసారి అని చెప్పవచ్చు. మార్చి 2022 నుండి ఇది వరుసగా నాలుగో నెలగా గుర్తించవచ్చు. అదే సమయంలో, ఏప్రిల్ 2022 తర్వాత, జూన్‌లో రెండవ అతిపెద్ద కలెక్షన్ ఇదే చెప్పవచ్చు. 

రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్స్ ఇవే...
ఏప్రిల్ 2022: 1,67,540 కోట్లు
మార్చి 2022: 1,42,095 కోట్లు
జనవరి 2022: 1,40,986 కోట్లు
మే 2022: 1,40,885 కోట్లు
ఫిబ్రవరి 2022: 1,33,086 కోట్లు

5 సంవత్సరాల GST: భారతదేశపు అతిపెద్ద పన్ను సంస్కరణ వస్తువులు,  సేవల పన్ను (GST) ప్రయాణం 5 సంవత్సరంలోకి అడుగు పెట్టింది.  ఈ ఐదేళ్లలో ప్రతినెలా లక్ష కోట్ల రూపాయల ఆదాయం సమకూరడం విశేషం. వస్తువులు, సేవల పన్ను (GST) 17 స్థానిక పన్నులు, ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, VAT వంటి 13 సెస్సులను ఉపసంహరించుకొని, దాని స్థానంలో జూలై 1, 2017 అర్ధరాత్రి అమలు చేసిన అతి పెద్ద పన్ను సంస్కరణ ఇదే. 

జీఎస్టీ కన్నా ముందు 31 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది...
జీఎస్టీకి ముందు, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సీఎస్టీ మొదలైనవాటితో సహా వినియోగదారుడు సగటున 31 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. కొత్త పన్ను విధానంగా ముందుకు వచ్చిన జీఎస్టీ అమలు చేయడం కోసం జిఎస్‌టి కౌన్సిల్‌ ఏర్పాటు చేశారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పన్నుల స్లాబులను నిర్ణయిస్తున్నాయి. దీంతో సమాఖ్య స్ఫూర్తి జీఎస్టీ ద్వారా వెల్లివిరిసింది. మొదట్లో కొన్ని వ్యాపార వర్గాలు జీఎస్టీ వల్ల అసంతృప్తికి లోనైనప్పటికీ, సరళీకరణ పన్ను వ్యవస్థ వల్ల వ్యాపారాలు రాష్ట్రాల సరిహద్దులను దాటుకొని సులభంగా చేసుకునే వీలు కలిగింది. 

జూన్ 2022లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు 
జూన్ జీఎస్టీ వసూళ్ల డేటాను ప్రభుత్వం జూలై 1న విడుదల చేయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో గత నాలుగు నెలల మాదిరిగానే ఈసారి కూడా రూ.1.40 లక్షల కోట్లు దాటింది. ఏప్రిల్ 2022లో ఈ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1.68 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఏప్రిల్, 2018లో కలెక్షన్లు తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటాయి.

మరోవైపు జీఎస్టీ పై పలు రాష్ట్ర ప్రభుత్వాలు అందులోని లోపాలను సరిదిద్దమని కేంద్రానికి నిరంతరం సిఫార్సు చేస్తున్నారు. జీఎస్టీని అమలు చేసే సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ గత కొన్నేళ్లుగా నిధుల పంపిణీ విషయంలో పెద్దఎత్తున రగడ జరుగుతోంది. జీఎస్టీ కౌన్సిల్ సకాలంలో తమకు చెల్లించాల్సిన రాష్ట్రాల వాటా డబ్బులు ఇవ్వడం లేదని రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ రాజకీయ స్ఫూర్తితో పనిచేస్తోందని పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు జిఎస్‌టి కౌన్సిల్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ పరిహారంపై వివాదం నడుస్తోంది.

రాష్ట్రాల డిమాండ్స్ ఇవే...
వాస్తవానికి, జీఎస్టీ విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు, రాష్ట్రాలకు వచ్చే ఆదాయ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లపాటు పరిహారం చెల్లించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చి 5 ఏళ్లు పూర్తవడంతో రాష్ట్రాలకు పరిహారం చెల్లించే గడువు కూడా ముగిసింది. ఈ గడువును పొడగించాలని  చాలా రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేసినా ఈ వారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios