Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ హ్యాట్రిక్ : సెన్సెక్స్ రికార్డు బ్రేకింగ్.. నేడు అల్ టైం హై..

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభించాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయ ఒడిదోడుకుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి తగ్గుతూ వచ్చాయి.  
 

Great rise in stock market: Record broken for the third consecutive day, Sensex closed above 58 thousand
Author
Hyderabad, First Published Sep 6, 2021, 6:58 PM IST

నేడు స్టాక్ మార్కెట్ రోజంతా హెచ్చు తగ్గులు తర్వాత మళ్లీ రికార్డు స్థాయిలో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 166.96 పాయింట్ల లాభంతో (0.29 శాతం) 58,296.91 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 54.20 పాయింట్ల (0.31 శాతం) లాభంతో 17,377.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్-నిఫ్టీ ముగింపులో ఇదే అత్యధిక స్థాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 58515.85, నిఫ్టీ 17,429.55 గరిష్ట స్థాయికి చేరుకుంది. గత వారంలో సెన్సెక్స్ 2,005.23 పాయింట్లు అంటే 3.57 శాతం పెరిగింది.  

టాప్ 100 కంపెనీలలో ఐ‌ఆర్‌సి‌టి‌సి 
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐ‌ఆర్‌సి‌టి‌సి) స్టాక్ నేడు సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .48,152.00 కోట్లుగా ఉంది. బి‌ఎస్‌ఈలో 140.10 పాయింట్లు లేదా 4.88 శాతం లాభంతో 3009.50 వద్ద ముగిసింది. గత ఏడాది నవంబర్‌లో రూ .1,291 వద్ద ఉంది. ఐ‌ఆర్‌సి‌టి‌సి మార్కెట్ స్థానం పరంగా టాప్ 100 కంపెనీల్లోకి ప్రవేశించి 93వ స్థానానికి చేరుకుంది.

కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఎదురుకొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థ బలంతో తిరిగి ట్రాక్‌లోకి వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జి‌డి‌పి వృద్ధి రేటు 20.1 శాతం. మొదటి త్రైమాసికంలో చైనా 7.9 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది, ఇవి చైనా కంటే మెరుగైన గణాంకాలు. అంటే చైనా కంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా మెరుగుపడిందని భావించవచ్చు. ఇది పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని పెంచింది.

also read స్టాక్ మార్కెట్‌ రికార్డ్ బ్రేకింగ్.. కొనసాగుతున్న బుల్ జోరు.. లాభాల స్వీకరణకు అవకాశం..

విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) నిరంతరం పెరుగుతున్నాయి, దీంతో దేశీయ మార్కెట్‌లో విజృంభణకు దారితీసింది. దీనితో పాటు వ్యాక్సినేషన్ కారణంగా ఇన్వెస్టర్లలో కరోనా భయం ముగిసినట్లు తెలుస్తుంది. ఈ అంశాలన్నీ షేర్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.

 పెద్ద స్టాక్స్ గురించి మాట్లాడుతూ విప్రో, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, హిందాల్కో షేర్లు గ్రీన్ మార్క్‌లో ముగిశాయి. మరోవైపు ఓ‌ఎన్‌జి‌సి, ఐ‌ఓ‌సి, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, కోటక్ బ్యాంక్ షేర్లు రెడ్ మార్క్‌లో ముగిశాయి.  

 నేడు ఎఫ్ఎంసిజి, బ్యాంకు, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్ సర్వీస్, పిఎస్‌యూ బ్యాంకు, ఫార్మా నష్టాలలో ముగిసింది. ఆటో, మీడియా, రియల్టీ, మెటల్, ఐటీ లాభాలలో మూగిసాయి.

 స్టాక్ మార్కెట్  నేడు ప్రారంభ ట్రేడ్‌లో రికార్డు స్థాయిలో ప్రారంభమైంది. సెన్సెక్స్ 269.92 పాయింట్ల లాభంతో (0.46 శాతం) 58399.87 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 73.70 పాయింట్ల లాభంతో (0.43 శాతం) 17397.30 వద్ద ప్రారంభమైంది. 

 శుక్రవారం స్టాక్ మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల తర్వాత గ్రీన్ మార్క్‌లో ముగిసింది. సెన్సెక్స్ 277.41 పాయింట్ల (0.48 శాతం) లాభంతో 58,129.95 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 89.45 పాయింట్ల (0.52 శాతం) లాభంతో 17,323.60 వద్ద ముగిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios