Asianet News TeluguAsianet News Telugu

నేటితో ముగిసిన గ్రాన్యూల్స్ ఇండియా వ్యాక్సిన్ డ్రైవ్‌.. 4వేల మందికి పైగా ఫ్రీ కోవిడ్-19 వాక్సినేషన్..

గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ & వైజాగ్ వ్యాప్తంగా ఉన్న  తయారీ సైట్లలో రెండవ డోస్ వ్యాక్సిన్లను  సిబ్బందికి  ఉచితంగా అందించే  కోవిడ్ వాక్సిన్ డ్రైవ్‌ను నేడు ముగించినట్లు ప్రకటించింది. 

Granules India Concludes its COVID-19 Vaccine Drive for its 4,500 Workforce
Author
Hyderabad, First Published Jul 13, 2021, 1:40 PM IST

హైదరాబాద్, 13 జూలై 2021: భారతదేశపు ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ & వైజాగ్ వ్యాప్తంగా ఉన్న  తయారీ సైట్లలో రెండవ డోస్ వ్యాక్సిన్లను  సిబ్బందికి  ఉచితంగా అందించే  కోవిడ్ వాక్సిన్ డ్రైవ్‌ను నేడు ముగించినట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఆథరైజేడ్ ఆస్పత్రుల సహకారంతో  ప్రాంతీయ టీకా డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఆమోదించిన ప్రోటోకాల్స్ ప్రకారం 4500 మంది ఉద్యోగులకు టీకాలు అందించారు.

కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి గ్రాన్యూల్స్  కంపెనీలో 625 పాజిటివ్ కేసులను నమోదయ్యాయి.  దీంతో ఉద్యోగులను వెంటనే  14 రోజుల పాటు సెల్ఫ్-ఐసోలేషన్ కి పంపారు, అయితే ఉద్యోగుల  ఐసోలేషన్ ఖర్చులు సంస్థ పూర్తిగా భరిస్తుంది. కరోనా సోకిన సిబ్బందికి ఫుల్ పెయిడ్  కోవిడ్ హాలిడేస్ ని కూడా సంస్థ విడుదల చేసింది.

ఉద్యోగులకు అవసరమైన కోవిడ్ మందులు, మల్టీ-విటమిన్ టాబ్లెట్లు, ఆక్సిమీటర్లతో కూడిన కోవిడ్ కిట్లు అందించారు. అంతేకాకుండా  24/7 అత్యవసర సంరక్షణ హెల్ప్‌లైన్, వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్స్, ఆక్సిజన్ సపోర్ట్ తో కోవిడ్-కేర్ హాస్పిటల్ రూంలు, హైదరాబాద్ ఇంకా వైజాగ్‌లోని క్వారంటైన్  కేంద్రాలను కూడా గ్రాన్యూల్స్ అందుబాటులో ఉంచారు.

గ్రాన్యూల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపతి మాట్లాడుతూ “మా కోవిడ్ టీకా డ్రైవ్‌ను మా ఉద్యోగులు అభినందించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ కరోనా మహమ్మారిని అధిగమించడానికి వాక్సిన్ మాత్రమే ఉత్తమమైన మార్గం అని మేము నమ్ముతున్నాము. ఈ ఛాలెంజింగ్ సమయాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సౌకర్యాలను కొనసాగించడానికి మాకు సహాయపడినందుకు మా  వర్క్ ఫోర్స్ కి ధన్యవాదాలు. ” అని అన్నారు.

also read ముఖేష్ అంబానీ లైఫ్ స్టయిల్లో ఈ 10 విషయాల గురించి తెలిస్తే నిజంగా నమ్మలేరు..ఆశ్చర్యపోతారు..

కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో గ్రాన్యూల్స్  కార్యాలయంలో సేఫ్టీ పై కూడా దృష్టిని కొనసాగించాయి. ఇన్నోవేటివ్ వర్క్-షెడ్యూల్ & షిఫ్ట్ ఇన్సెంటివ్స్ తో  మందుల ఉత్పత్తులు  నిరంతర ఉత్పత్తిని కొనసాగిస్తూ మినిమమ్ వర్క్ ఫోర్స్  తో ఈ లక్ష్యాన్ని సాధించాయి. మా సంస్థలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత పది రోజుల నుండి సున్నా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి  సహకారం ఇవ్వడంలో గ్రాన్యూల్స్ ముందంజలో ఉంది. వీటిలో  ఔషధాలు, అంబులెన్స్, పిపిఇ మొదలైన వివిధ రూపాల్లో  అందిస్తుంది.

గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ గురించి:

1984లో విలీనం అయిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ వేగంగా  అభివృద్ధి చెందుతున్న భారతీయ  ఔషధ సంస్థ. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయంగా  అత్యుత్తమ సౌకర్యాలు, నాణ్యత, కస్టమర్ సేవలకు కట్టుబడి ఉంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడీఎంట్స్ (ఎపిఐలు), ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ ఇంటర్మీడియట్స్ (పిఎఫ్‌ఐ), ఫినిష్డ్ డోజెస్ (ఎఫ్‌డి) నుండి మొత్తం వాల్యు చైన్  తయారీలో ప్రపంచంలోని అతికొద్ది ఔషధ సంస్థలలో మేము ఒకటిగా ఉన్నాము.

మా ఉత్పత్తులు రెగ్యులేటెడ్ అండ్ సెమీ-రెగ్యులేటెడ్ మార్కెట్లలో 250 మందికి పైగా కస్టమర్లతో డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయి. భారతదేశం, యు.ఎస్, యు.కె.లో ఆఫీసులతో 60 దేశాలకు పైగా విస్తరించి ఉంది. కంపెనీకి 7 ఉత్పాదక సౌకర్యాలు ఉన్నాయి, వీటిలో 6 భారతదేశంలో  1 యూ‌ఎస్‌ఏ ఉన్నాయి. అలాగే  US FDA, EDQM, EU GMP, COFEPRIS, WHO GMP, TGA, K FDA, DEA, MCC, HALAL నుండి రెగ్యులేటరీ ఆమోదాలు పొందింది.

Follow Us:
Download App:
  • android
  • ios