Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్‌ఇండియా అమ్మకానికి ఆహ్వానం... టాటా సన్స్, హిందూజాల ఆసక్తి ?

కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించేందుకు గంట మోగింది. నూరుశాతం ఈక్విటీల విక్రయాల కోసం బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తిగల సంస్థల మార్చి 17వ తేదీలోపు స్పందించాల్సి ఉంటుంది. టాటా సన్స్, హిందూజా గ్రూప్, ఇండిగో, స్పైస్ జెట్ తదితర సంస్థలు ఎయిర్ ఇండియాను టేకోవర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది.

Government. invites bids for 100% stake sale in Air India
Author
Hyderabad, First Published Jan 27, 2020, 10:53 AM IST

న్యూఢిల్లీ: నష్టాలతో సతమతం అవుతున్న ఎయిర్‌ఇండియాలో నూరు శాతం వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం సోమవారం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానిస్తున్నది. దీంతో ఎయిర్‌లైన్‌ను ఎవరు దక్కించుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది. 

also read గ్రామీణ స్టార్టప్‌లకు ప్రోత్సాహాలివ్వండి.. రుణ పరపతి అవకాశాలు పెంపొందించండి

ఎయిర్‌ఇండియాను కొనుగోలు చేయడానికి ఆసక్తితో మొగ్గు చూపే సంస్థలు ఈ ఏడాది మార్చి 17 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు స్పందించాల్సి ఉంటుంది. ఎయిర్‌ఇండియాను చేజిక్కించుకునేందుకు టాటా సన్స్‌, హిందూజా, ఇండిగో, స్పైస్‌జెట్‌ సహా కొన్ని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు పోటీ పడవచ్చని భావిస్తున్నారు. 

Government. invites bids for 100% stake sale in Air India

మరోవైపు దేశీ విమానయాన సంస్థలతో కలిసి కొన్ని విదేశీ ఎయిర్‌లైన్స్‌ కూడా సంయుక్త బిడ్ల ద్వారా బిడ్డింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకునే అవకాశం ఉంది. ఎయిర్‌ఇండియా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది.

also read స్వామినాథన్ సిఫారసుల అమలుతో రెండేళ్లలో రెట్టింపు ఆదాయం పక్కా.. 

దీంతోపాటు ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఎయిర్‌ఇండియాకు విస్తృతంగా ఉన్న దేశీ, విదేశీ నెట్‌వర్క్‌, లండన్‌, దుబాయ్‌ వంటి కీలక విదేశీ విమానాశ్రయాల్లో ట్రాఫిక్‌ రైట్స్‌, స్లాట్‌లు, సాంకేతిక సిబ్బంది కలిగి ఉండటం, పెద్ద సంఖ్యలో విమానాలు ఉండటంతో కొనుగోలుదారులు టేకోవర్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు. 

ఎయిర్‌లైన్‌ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని భావిస్తుండటంతో కొనుగోలుదారులు లేవనెత్తే డిమాండ్లను అంగీకరించి విక్రయ ప్రక్రియను పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు పంపుతోందని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఇండియా మాజీ చీఫ్‌ రాజన్‌ మెహ్రా పేర్కొన్నారు. కాగా ఎయిర్‌ఇండియా ప్రస్తుతం రోజుకు సగటును రూ.20-25 కోట్ల నష్టంతో నడుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios