గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ జీతం ఎంతో తెలుసా....?
సుందర్ పిచాయ్ గతంలో గూగుల్ టూల్ బార్, తరువాత గూగుల్ క్రోమ్ అభివృద్ధికి భాద్యతలు నిర్వహించారు.ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ బ్రౌజర్‌గా ఎదిగింది.
శాన్ఫ్రాన్సిస్కో: ఆల్ఫాబెట్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) సుందర్ పిచాయ్ 2020గాను 2 మిలియన్ల పైగా వార్షిక జీతం మొత్తంగ 240 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ ప్యాకేజీని పొందనున్నారు. ఆన్‌లైన్ సెర్చ్ దిగ్గజం పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు తమ సహ వ్యవస్థాపకుల పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించడంతో ఈ నెలలో ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్‌ను నియమించారు.
also read ఆందోళన వద్దంటున్న ‘నిర్మల’మ్మ.. ఆ అలోచనల నుంచి బయటకు రండి...
సుందర్ పిచై భారతదేశంలో జన్మించి గూగుల్ మరియు ఆల్ఫాబెట్ రెండింటికి సిఇఒగా ఎదిగారు.శుక్రవారం సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) కు దాఖలు చేసిన ఆల్ఫాబెట్, సుందర్ పిచాయ్ కూడా 1 జనవరి 2020 సంవత్సరాం నుంచి 2 మిలియన్లకు గణనీయమైన పెంపును పొందుతారని ఓ న్యూస్ నివేదిక తెలిపింది.
"పిచాయ్ మరో రెండు స్టాక్ గ్రాంట్లు పొందారు ఒకటి 120 మిలియన్ డాలర్లు, 30 మిలియన్ డాలర్లు కూడా అందుకున్నాడు. గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ ఈ నెల ప్రారంభంలో పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్‌లో తమ పదవులని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
also read సోనియా గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు: కేంద్ర మంత్రి
కానీ మిస్టర్ పేజ్, మిస్టర్ బ్రిన్ సహ వ్యవస్థాపకులు, వాటాదారులు ఇంకా ఆల్ఫాబెట్ డైరెక్టర్ల బోర్డు సభ్యులుగా ఉంటూ తమ ప్రమేయాన్ని కొనసాగిస్తారు. సుందర్ పిచాయ్ 2004 లో గూగుల్ సంస్థలో చేరారు. గూగుల్ టూల్‌బార్, తరువాత గూగుల్ క్రోమ్ అభివృద్ధికి భ్యద్యతలు వహించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ బ్రౌజర్‌గా ఎదిగింది. అతను ఆగస్టు 2015 లో గూగుల్ సిఈఓ అయ్యాడు.
సుందర్ పిచాయ్ జూలై 2017 లో ఆల్ఫాబెట్ బోర్డులో చేరారు.సిఈఓగా అతని నాయకత్వంలో, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో తాజా పురోగతి ద్వారా శక్తినిచ్చే ప్రాడక్ట్లు మరియు సర్వీస్ లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. చెన్నైలో పెరిగిన సుందర్ పిచాయ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) లో ఇంజనీరింగ్ చదివిన సుందర్ పిచాయ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ, వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏ పట్టా పొందారు.