PM kisan Man dhan Yojna: కేంద్రప్రభుత్వం రైతుల సామాజిక భద్రత కోసం ఉద్దేశించి అనేక పథకాలు ప్రవేశ పెట్టింది. ఇప్టికే పీఎం కిసాన్ యోజన కింద ఏటా 6 వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అలాగే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM kisan Man dhan Yojna) ద్వారా ఏటా రూ.36000 ను అందిస్తోంది. ఈ పథకం లబ్ధిదారులుగా మారాలంటే రైతులు ఏం చేయాలో తెలుసుకుందాం.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) కూడా ఒకటి. దీని ద్వారా నేరుగా రైతుల ఖాతాలకు డబ్బు బదిలీ అవుతుంది. కేంద్రప్రభుత్వం ప్రతి రైతు ఖాతాలో ఏటా 6,000 రూపాయలు జమ చేస్తోంది.
ప్రభుత్వం ఈ డబ్బును 3 వాయిదాలలో ట్రాన్స్ ఫర్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి విడతలో 2,000 వేల రూపాయలను బదిలీ చేస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని సద్వినియోగం చేసుకునే రైతులు ఏటా రూ. 36,000 కూడా పొందవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి పత్రాలను అందించాల్సిన అవసరం లేదు.
సంవత్సరానికి రూ. 36,000 ఎలా పొందాలి (PM kisan Man dhan Yojna)
ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (PM kisan Man dhan Yojna) కింద రైతులకు పింఛను అందజేస్తున్నారు. ఈ పథకం కింద, రైతుకు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3,000 పింఛను లభిస్తుంది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.
ఈ పథకాన్ని ఎవరు సద్వినియోగం చేసుకోవచ్చు
1- ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి, 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల ఏ రైతు అయినా సద్వినియోగం చేసుకోవచ్చు.
2- దీని కింద, రైతుకు గరిష్టంగా 2 హెక్టార్ల సాగు భూమి ఉండాలి.
3 - పథకం కింద, కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాలు, నెలవారీ డబ్బు రూ. 55 నుండి రూ. 200 వరకు చెల్లించాలి. రైతు వయస్సును బట్టి నిర్ణయిస్తారు.
3 - 18 సంవత్సరాల వయస్సు నుంచి చేరిన రైతులు ఈ పథకంలో కోసం నెలకు రూ. 55 చెల్లించాలి.
4- మీరు 30 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరినట్లయితే, అప్పుడు ప్రతి నెల 110 రూపాయలు డిపాజిట్ చేయాలి.
5 - మీరు 40 సంవత్సరాల వయస్సులో చేరినట్లయితే, ప్రతి నెలా 200 రూపాయలు డిపాజిట్ చేయాలి.
