24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5,027గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే ధరల్లో పెద్దగా మార్పు లేదు. అదే విధంగా 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40,216గా ఉంది. పండగ రోజుల్లో ధరలు నిలకడగా ఉన్నాయి అంటే బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మీకు మంచి అవకాశం అని చెప్పవచ్చు.   

దీపావళి రోజున బంగారం మరియు వెండి కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు దీపావళి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే నేడు బంగారం, వెండి ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక నివేదిక ప్రకారం ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 4,788. కాగా నిన్నటి ధర ఇదే. అంటే ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.

 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5,027గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే ధరల్లో పెద్దగా మార్పు లేదు. అదే విధంగా 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40,216గా ఉంది. పండగ రోజుల్లో ధరలు నిలకడగా ఉన్నాయి అంటే బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మీకు మంచి అవకాశం అని చెప్పవచ్చు.

నేటి వెండి ధర
వెండి గురించి మాట్లాడినట్లయితే, ఛోటీ దీపావళి వరకు వెండి ధర వరుసగా రెండవ రోజు మారింది, కానీ దీపావళి రోజున ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఒక గ్రాము వెండి ధర రూ.63.20గా ఉంది. ఒక కేజీ వెండి ధర నేడు రూ.63,200 కాగా, ధన్తేరస్ రోజున ఈ ధర రూ.61,500, అంటే రూ.1,700 పెరిగిన తర్వాత స్థిరత్వం వచ్చింది.

22 అండ్ 24 క్యారెట్ బంగారం మధ్య తేడా 
24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయితే, 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు చేయలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తారు.

గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,450 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,150. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 51,290 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 47,010. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.51,290 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.47,010గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.47,010 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.10 పెరిగి రూ.51,290కి చేరింది. అయితే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.63,200 వద్ద స్థిరంగా ఉంది. కానీ అంతకుముందు రోజు ఏకంగా రూ.1700 పెరగడం గమనార్హం. 

ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1657 డాలర్ల వద్ద ఉండగా, స్పాట్ సిల్వర్ ఔన్సుకు 19.28 డాలర్లకు పెరిగింది. ఇక రూపాయి విషయానికి వస్తే ప్రస్తుతం డాలర్ మారకం విలువ రూ.82.68 వద్ద కొనసాగుతోంది. 

అంతకుముందు ధన్‌తేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం, వెండి కొనుగోళ్లు, అమ్మకాలు భారీగా జరిగాయి. ఒక నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం ధన్‌తేరస్ సందర్భంగా పసిడి కొనుగోలుపై ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మినహా శని, ఆదివారాల్లో ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) రేట్లు విడుదల చేయకపోవడం గమనార్హం.

బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 ఉంటుంది.