Asianet News TeluguAsianet News Telugu

పెళ్లిళ్ల సీజన్లో పసిడికి భలే గిరాకీ.. నేటికీ రికార్డ్ హైలో ధరలు.. 22 క్యారెట్ల తులానికి ఎంతంటే..?

0248 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,982.69 వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% తగ్గి $1,991.00కి చేరుకుంది.
 

Gold silver rates today surges in Hyderabad Bangalore Kerala Visakhapatnam on  02 May 2023-sak
Author
First Published May 2, 2023, 11:18 AM IST

నేడు  02 మే 2023న  దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా ఇంకా ముంబైలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 60,910 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,420. 

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,760. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,760. 

వెండి ధరలు చూస్తే  కోల్‌కతా, ముంబైలో కేజీ ధర రూ.76,000, చెన్నైలో వెండి ధర కేజీకి రూ. 80,200.

0248 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,982.69 వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% తగ్గి $1,991.00కి చేరుకుంది.

మరోవైపు మే 2-3 తేదీల్లో సమావేశమయ్యే ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని విస్తృతంగా భావిస్తున్నారు.

ఇక హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు కాస్త  ఎగిశాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,760. హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,760.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,760. విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,760. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 80,200గా  ఉంది. 

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని ఇంకా బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios