Asianet News TeluguAsianet News Telugu

బంగారం కొనాలనుకుంటున్నారా..? ఆల్ టైం హైలో ధరలు.. నేడు 24 క్యారెట్ల తులం ధర ఎంతంటే..?

 ప్రముఖ నగరాలలో  నేడు బంగారం ధరలు మార్పులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.
 

Gold rates today remains stable in Hyderabad Bangalore Kerala Visakhapatnam  20 March 2023-sak
Author
First Published Mar 20, 2023, 11:36 AM IST

భారతదేశంలో గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ బంగారం ధరలు తగ్గాయి. సోమవారం మార్చి 20 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 58,220 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,330.

 ప్రముఖ నగరాలలో  నేడు బంగారం ధరలు మార్పులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,840 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,950. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,690 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 53,800. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,690 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.53,800గా ఉంది.

భువనేశ్వర్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 58,690 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53,800.

అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1975 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర విషయానికి వస్తే ఔన్సుకు $22.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి మారకం విలువ ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే స్థిరంగా రూ.82.595 వద్ద ఉంది.

హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,320. 

హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,320. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,320. విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,320. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,400.

Follow Us:
Download App:
  • android
  • ios