బంగారం ధరలు దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం కూడా పసిడి రేట్లు ఈరోజు కూడా అదే దారిలో నడిచాయి. వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన రెండు రోజులుగా రేట్లు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ రోజు పసిడి రేటు రూ.250 పెరిగింది. వెండి రేటు రూ.300 పైకి పెరిగింది.
దేశంలోపసిడి ధరలు మరోసారి పెరుగుదల బాటపట్టాయి. శనివారం బంగారం ధరలు పెయిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు నేడు 10 గ్రాములకు గానూ రూ.250 మేర పెరిగింది. అదే సమయంలో 22 కేరట్ల బంగారం రూ.250 చొప్పున పెరిగాయి. వరుసగా రెండు రోజుల పాటు రూ.450 మేర పెరిగింది. వెండి రేట్లు కిలోకు రూ.300 పెరిగాయి.
అదే ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం చూస్తే.. 24 కేరట్ల బంగారం ధర రూ. 51,631, 22 కేరట్ల బంగారం రేటు రూ. 47,485, సిల్వర్ రేటు కేజీకి రూ. 66,636 పలికింది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల (10 గ్రా) బంగారం ధర రూ.51,530 కాగా, 22 క్యారెట్లు (10 గ్రా) రూ.49,069గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,630 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.48,250గా ఉంది.
విశాఖపట్నంలో 24 క్యారెట్ల (10 గ్రా) బంగారం ధర రూ.52,630 కాగా, 22 క్యారెట్ల (10 గ్రా) ధర రూ.48,250గా ఉంది. అదే సమయంలో ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,630 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.48,250గా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.52,630 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.48,250. గత 24 గంటల్లో 24 క్యారెట్ల (10 గ్రా), 22 క్యారెట్ల (10 గ్రా) బంగారం ధర రూ.260 పెరిగింది. మీరు ఇప్పుడు బంగారం కొనుగోలు చేస్తే, మీకు దాదాపు రూ. 5,000 ప్రయోజనం లభిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.
మరోవైపు రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ ఉద్రికత్తలు సద్దుమణిగినా కూడా పసిడి పరుగు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. అధిక కమోడిటీ ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతూ వెళ్లడం వంటి అంశాలు బంగారం ధరకు మద్దతు ఇస్తున్నాయని తెలియజేస్తున్నారు. టెక్నికల్ చార్ట్ ప్రకారం చూస్తే.. గోల్డ్, సిల్వర్ రేట్లు షార్ట్ కవరింగ్‌ను సూచిస్తున్నాయని పేర్కొంటున్నారు.
