Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్ బంగారం ఏకంగా రూ. 50 వేల దిగువకు పడిపోయే చాన్స్...ఎప్పుడంటే..?

దేశీయంగాను, అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా డాలర్ బలం పుంజుకోవడంతో, బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. భవిష్యత్తులో బంగారం ధరలు ఏకంగా 50 వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold Rate Good news for women, gold is Rs. Chances of falling below 50 thousand MKA

బంగారం ధర గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే భారీగా తగ్గింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా చూసినట్లయితే పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.  హైదరాబాద్ నగరంలో  కూడా గమనించినట్లయితే పసిడి ధరలు  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020గా నమోదైంది.  అయితే నిన్నటితో పోల్చి చూసినట్లయితే ఏకంగా 600 రూపాయలు తగ్గింది.  ఇక 22 క్యారెట్ల బంగారం ధర  గమనించినట్లయితే 54,100 రూపాయలు పలుకుతోంది.  ముఖ్యంగా అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం వలన దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 అమెరికన్ బులియన్ మార్కెట్లో ఒక ఔన్స్ (31 గ్రాములు) బంగారం ధర 1920 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  ఈనెల ప్రారంభంలో ఈ ధర 1980 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.  అక్కడి నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం 1920 దారుల వద్ద స్థిరపడ్డాయి అంటే గడచిన 20 రోజుల్లో బంగారం ధర ఏకంగా 60 డాలర్లు తగ్గింది.  గత నెలతో పోల్చినట్లయితే బంగారం ధర ఏకంగా 110 డాలర్లు తగ్గింది.  దీంతో పసిడి ప్రియుడు పండగ చేసుకుంటున్నారు ముఖ్యంగా ఆషాడమాసంలో దేశీయంగా కూడా డిమాండ్ తగ్గడంతో ఒకసారిగా బంగారం కొనుగోలు చేయాలని కస్టమర్లు  ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 
 
అంతేకాదు ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం  డాలర్ ధర పుంజుకోవడం అని చెప్పవచ్చు. ప్రస్తుతం  డాలర్ మారకం విలువ భారీగా పెరిగింది.  ఈ నేపథ్యంలో బంగారం ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది దీనికి ప్రధాన కారణం లేకపోలేదు డాలర్ ధర పుంజుకునే కొద్ది అమెరికా ట్రెజరీ బాండ్లు విలువ కూడా పెరుగుతుంది దీంతో మధుపరులు చాలామంది తమ పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బ్యాండ్ బాండ్లు కొనేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఫలితంగా బంగారం ధరలు తగ్గుతాయి. 

 సాధారణంగా మార్కెట్ ఆందోళనలో ఉన్నప్పుడు లేదా మార్కెట్  క్షీణిస్తున్నప్పుడు మాత్రమే బంగారం పై పెట్టుబడులు వెల్లువెత్తుతాయి సాధారణ సమయాల్లో బంగారంపై పెట్టుబడులో అంతగా ఉండవు.  కానీ ప్రస్తుతం మార్కెట్లో సెక్యూరిటీ మార్కెట్లు అదేవిధంగా బాండ్ మార్కెట్లలో సానుకూలంగా ఉన్న నేపథ్యంలో మధుపరులు. తమ పెట్టుబడులను అటువైపే తరలిస్తున్నారు ఫలితంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 

మరోవైపు బంగారం ధరలు దేశీయంగా కూడా భారీగా తగు ముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం 60000 దిగువనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పలుకుతోంది.  ఈ ధర నుంచి బంగారం  మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో   పసిడి ధరలు  దేశీయ మార్కెట్లో కనీసం 50వేల స్థాయి వరకు దిగి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 అక్టోబర్ నాటికి పరిస్థితులు ఇలాగే కొనసాగితే పసిడి ధరలు 50 వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు కానీ ఇంకా అమెరికా సహా  అగ్రదేశాల్లో  ద్రవ్యోల్బణం  ఇంకా తగ్గుముఖం పట్టలేదు.  ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత అస్థిరంగా కొనసాగే అవకాశం ఉందని ఓ వాదన వినిపిస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios