రికార్డు గరిష్ట స్థాయి నుంచి బంగారం వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి దీంతో పసిడి మార్కెట్లో జోష్ కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడంతో ఆభరణాల షాపులు కళకళలాడుతున్నాయి. నేడు గురువారం బంగారం వెండి తాజా ధరలను తెలుసుకుందాం.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొన్ని ఎందుకు షాపింగ్ కోసం మీరు వెళుతున్నట్లయితే ఈ రోజు రేటు తెలుసుకోవడం చాలా అవసరం తద్వారా మీరు ఈరోజు షాపింగ్ చేయాలా వద్దా అనే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. బంగారం ధర గత నాలుగైదు రోజులుగా గమనించినట్లయితే వరుసగా తగ్గుతూ వస్తోంది. మీరు బంగారం లేదా వెండిని కొనుగోలు చేయబోతున్నట్లయితే, మీకు ఇది శుభవార్త. ఈరోజు బంగారం ధర పడిపోయింది. 

ఈరోజు బంగారం ధర రూ.500 పైగా తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు క్షీణతతో ట్రేడవుతున్నాయి. స్పెక్యులేటర్లు తమ స్థానాలను తగ్గించుకోవడంతో బుధవారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.582 తగ్గి రూ.56,168కి చేరుకుంది.

ఈరోజు బంగారం వెండి ధర మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఏప్రిల్‌లో డెలివరీకి సంబంధించిన బంగారం ధర 13,775 లాట్ల వ్యాపార టర్నోవర్‌లో రూ. 582 లేదా 1.03 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.56,168 వద్ద ట్రేడవుతోంది. డీల్స్‌ ఆఫ్‌లోడ్‌ చేయడం వల్లే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం 1 శాతం తగ్గి 1,846.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.65,510కి తగ్గింది. వ్యాపారులు పొజిషన్లు తగ్గించడంతో బుధవారం వెండి ఫ్యూచర్స్ కిలో రూ.741 తగ్గి రూ.65,510కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, మార్చిలో డెలివరీకి వెండి కిలో రూ.741 లేదా 1.12 శాతం తగ్గి రూ.65,510కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా, న్యూయార్క్‌లో ఔన్స్ వెండి 1.36 శాతం తగ్గి 21.58 డాలర్లకు చేరుకుంది.

ఇక రిటైల్ మార్కెట్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,160 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఈ ధర రూ. 57, 260గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 57, 200 వద్ద ట్రేడ్ అవుతోంది. విశాఖ పట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 57,200 వద్ద పలుకుతోంది. 

ఇక కిలో వెండి విషయానికి వస్తే హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 72,000గా ఉంది. వెండి ధరలు రోజు రోజుకి తగ్గుతున్నాయి. బంగారం వెండి ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా మాత్రం పసిడికి డిమాండ్ గణనీయంగా ఉంది ప్రస్తుతం ట్రేడర్లు లాభాల స్వీకరణలో ఉన్నారు దీంతో పసిడి ధరలు కాస్త తగ్గాయి కానీ భవిష్యత్తులో మాత్రం పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు