న్యూఢిల్లీ/ముంబై: దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌ (ఎంసీఎక్స్)లో సోమవారం ఉదయం బంగారం ధర పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసులు సంఖ్య కోటి దాటడంతోపాటు దాదాపు ఐదు లక్షల మంది మృత్యువాత పడ్డారు.

దీంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ దెబ్బ తినడంతో వారందరికీ పసిడి తమ పెట్టుబడికి స్వర్గధామంగా నిలిచింది. దీంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందా? అన్న అంశంపై ఇన్వెస్టర్లకు సందేహాలు తలెత్తి తమ పెట్టుబడులను బంగారంలోకి మళ్లించారు. 

అలాగే ఈక్విటీ సూచీల భారీ పతనం, అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ పెరగడం, రూపాయి స్థిరమైన ట్రేడింగ్‌ తదితర అంశాలు బంగారానికి డిమాండ్‌ పెరిగిందని బులియన్‌ పండితులు చెబుతున్నారు. 

also read బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్... కరోనా ‘ఎఫెక్ట్’ మామూలుగా లేదు.. ...

ఉదయం 10 గంటలకు తులం బంగారం ధర పెరిగి రూ.115 పెరిగి రూ.48450 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధర 10 డాలర్లు పెరిగింది. సోమవారం ఆసియాలో ఉదయం సెషన్‌లో తులం బంగారం ధర శుక్రవారం ముగింపుతో పోలిస్తే 10 డాలర్లు పెరిగి 1,790డాలర్లు వద్ద ట్రేడ్‌ అవుతోంది.

మరోవైపు, ఈ అంశంపై కూడా బులియన్‌ ట్రేడర్లు దృష్టిని సారించారు. ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో 0.52 శాతం పెరిగి కిలో వెండి ధర రూ.49,494కు చేరుకున్నది. నెల రోజులుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. 

ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌ జెరోమ్ పావెల్‌తోపాటు ఆర్థికమంత్రి స్టీవెన్ మునుచిన్‌ ఆర్థికవ్యవస్థ ఔట్‌లుక్‌, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ తదుపరి చర్యలపై రేపు (మం‍గళవారం) హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు ప్రసగించనున్నారు.