బంగారం ధరలు వరుసగా నేడు  4వ రోజు కూడా పడిపోయాయి. బలమైన రూపాయి, అధిక స్థాయిలో లాభాల మధ్య భారతదేశంలో బంగారం ధరలు వరుసగా నాలుగవ రోజు కూడా పడిపోయాయి. ఎం‌సి‌ఎక్స్ లో ఆగస్టు బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.34% పడిపోయి రూ.47,882 కు చేరుకుంది.

ఎం‌సి‌ఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 0.36% క్షీణించి  వెండి కిలోకు  రూ.49,000కు చేరుకుంది. స్పాట్ బంగారం ఔన్సుకు 0.1% పెరిగి 1,775.97 డాలర్లకు చేరుకుంది. గత బుధవారం రికార్డుస్ధాయిలో 10 గ్రాముల బంగారం 48,982 రూపాయలు పలుకగా వరుసగా నాలుగు రోజుల్లో తులం బంగారం ఏకంగా 1000 రూపాయలు దిగివచ్చింది.  

ఇతర విలువైన లోహాలలో ప్లాటినం ధర 0.8% పెరిగి 806.30 డాలర్లకు చేరుకోగా, వెండి 0.1% తగ్గి 18.02 డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ వడ్డీ రేట్లు, ప్రధాన కేంద్ర బ్యాంకుల నుండి విస్తృతమైన ఉద్దీపన డిమాండ్ పెంచడంతో ఈ సంవత్సరం స్పాట్ బంగారం 17% పెరిగింది.

also read వృద్ధి రేటు మైనస్‌కి పడిపోతున్నా.. టాప్-5లోకి ఇండియా ...

ఆసియా ఈక్విటీ మార్కెట్లు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 11.4 మిలియన్లకు పైగా ప్రజలు సోకినట్లు ఒక నివేదికలో తెలిపింది. డిజిటల్ మోడ్ ద్వారా పేమెంట్ చేస్తే గ్రాముకు రూ. 50 తగ్గింపు లభిస్తుంది.

కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండటం, అంతర్జాతీయ అనిశ్చితి పరిణామాలతో పసిడి ధరలు నిలకడగా కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ధరలు, కరోనావైరస్ సంక్షోభం మధ్య భారతదేశంలో బంగారం భౌతిక డిమాండ్ తగ్గింది.

డీలర్లు గత వారం అధికారిక ధరలతో పోలిస్తే ఔన్స్‌కు సుమారు  22 డాలర్ల తగ్గింపును ఆఫర్ చేశారు. భారతదేశంలో దేశీయ ధరలలో 12.5% ​​దిగుమతి సుంకం మరియు 3% జీఎస్టీ ఉన్నాయి.