ముంబై: బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గాయి. సోమవారం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గుదలతో రూ.32,620కు క్షీణించింది. అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా ఉండటంతోపాటు జువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మిందగించడంతో ఈ క్షీణత చోటు చేసుకుంది. 

బంగారం బాటలోనే వెండి ధర కూడా నడుస్తోంది. కిలో వెండి ధర రూ. 80 తగ్గడంతో రూ. 38,100కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ప్రతికూల ప్రభావం చూపింది. 

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు  0.41శాతం తగ్గడంతో 1,289.75 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.51శాతం క్షీణించడంతో 14.88 డార్లకు పడిపోయింది. 

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,670కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 30,160కి తగ్గింది. కిలో వెండి ధర రూ. 40,100కు తగ్గింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గడంతో రూ. 32,620కి, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గుదలతో రూ. 32,450కి క్షీణించింది.