ఇతర లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్‌కు తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది. రుణం కూడా తక్షణమే అందుతుంది. సులభమైన రీపేమెంట్ ఆప్షన్ సైతం ఎంచుకోవచ్చు. గోల్డ్ లోన్ కోసం ప్రముఖ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను తెలుసుకుందాం.
అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఎందుకంటే ఆపత్కాలంలో బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు పొందవచ్చని భావించే వారు చాలా మంది ఉంటారు. బంగారం ధరల పెరుగుతున్న నేపథ్యంలో బంగారం తనఖా రుణాలు నేడు అధిక డిమాండ్ ఉన్న రిటైల్ రుణాలుగా మారిపోయాయి. బంగారు తనఖా రుణాల కోసం ఆర్థిక సంస్థలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు సేవలతో పోటీ పడుతున్నాయి. ఇతర లోన్లతో పోలిస్తే, తక్కువ డాక్యుమెంటేషన్ తో పాటు, వివిధ రకాల రీపేమెంట్ ఆప్షన్ల నుండి ఎంచుకోవచ్చు. గోల్డ్ లోన్ కోసం ప్రముఖ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను తెలుసుకోవడం ద్వారా ఏ బ్యాంకులో తక్కువ రుణం ఉందో, బేరీజు వేసుకోవచ్చు.
>> HDFC బ్యాంక్: బంగారు రుణాలపై వడ్డీ రేటు 7.20 శాతం నుండి 11.35 శాతం వరకు ఉంటుంది. 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేస్తారు.
>> కోటక్ మహీంద్రా బ్యాంక్: గోల్డ్ లోన్ 8% నుండి 17% వడ్డీని వసూలు చేస్తుంది. అదనంగా, 2 శాతం ప్రాసెసింగ్ ఫీజు GST వసూలు చేస్తారు.
>> యూనియన్ బ్యాంక్: గోల్డ్ లోన్ 8.40 శాతం నుండి 9.65 శాతం వడ్డీని వసూలు చేస్తుంది
>> సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.45 శాతం నుండి 8.55 శాతానికి లోన్ మొత్తంలో 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు.
>> UCO బ్యాంక్: బంగారం తనఖా రుణాలపై 8.50 శాతం వడ్డీ రేటు రూ. 250 నుంచి రూ. 5,000 వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు.
>> SBI: 8.55 శాతం ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజుతో పాటు GST వసూలు చేస్తుంది
>> ఇండస్ ఇండ్ బ్యాంక్: 8.75 శాతం నుండి 16 శాతం వడ్డీ 1 శాతం ప్రాసెసింగ్ రుసుము వసూలు చేస్తుంది
>> పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 8.85 శాతం వడ్డీ రూ. 500 నుండి రూ. 10,000 ప్రాసెసింగ్ ఫీజు
>> ఫెడరల్ బ్యాంక్: గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.89 శాతం.
>> పంజాబ్ నేషనల్ బ్యాంక్: PNB గోల్డ్ లోన్ 9 శాతం వడ్డీని 0.75 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది.
బంగారం ధర తరచు పెరుగుతుండడంతో దేశంలో బంగారం కొని ఇంట్లో పెట్టుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. గోల్డ్‌లోన్‌పై ఆధారపడటం అనేది వ్యక్తిగత వ్యాపార అవసరాల కోసం డబ్బు పొందడానికి సులభమైన మార్గాలలో ఒకటి. తాకట్టు పెట్టిన బంగారం పరిమాణం స్వచ్ఛత ఆధారంగా ఆర్థిక సంస్థలు రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి.