Gold loan Vs Personal loan: గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ ఈ రెండింట్లో ఏది సౌకర్యవంతమైనది అనే దానిపై నిపుణుల అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాి. అయితే పర్సనల్ లోన్స్ కంటే గోల్డ్ లోన్స్ వేగంగా రుణం పొందే వీలుంది. 

Gold loan Vs Personal loan: ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఆర్థిక సహాయం అవసరం అవుతుంది. సాధారణంగా రుణాలు తీసుకోవాలంటే బ్యాంకులు చాలా నిబంధనలను పెడుతుంటాయి.అయితే అన్ని రుణాల కన్నా కూడా బంగారం రుణం పొందండం చాలా సులభం. ముఖ్యంగా పర్సనల్ లోన్‌తో పోలిస్తే గోల్డ్ లోన్ పొందడం చాలా సులభం, అంతేకాదు చాలా మంది నిపుణులు వ్యక్తిగత రుణం కంటే గోల్డ్ లోన్ వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంటున్నారు. పలు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోన్ సులభంగా అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో బ్యాంకు రుణం పొందవచ్చు.

పర్సనల్ లోన్ కంటే... గోల్డ్ లోన్ వేగంగా పొందే చాన్స్. 
పర్సనల్ లోన్ కోసం దేనినీ తాకట్టు పెట్టనవసరం లేదు. కానీ గోల్డ్ లోన్ విషయంలో, బంగారు నగలను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇందులో బంగారం తనఖా పెట్టి అప్పు తీసుకుంటారు. పర్సనల్ లోన్‌ కోసం అయితే అనేక డాక్యుమెంట్‌లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస రుజువు ఇతర రుజువులు వంటివి సమర్పించాలి. పర్సనల్ లోన్ కాస్త సమయం పట్టే ప్రక్రియ. కానీ పర్సనల్ లోన్‌తో పోలిస్తే గోల్డ్ లోన్ వేగంగా లోన్ పొందవచ్చు. 

ప్రాసెసింగ్ ఫీజు..
పర్సనల్ లోన్స్ విషయంలో బ్యాంకులు రుణాలపై ప్రాసెసింగ్ రుసుములను వసూలు చేస్తాయి. ఇది 0.5 శాతం నుండి 1 శాతం వరకు ఉండవచ్చు. గోల్డ్ లోన్ విషయంలో, రుణగ్రహీతలు తమ బంగారం నిల్వను సెక్యూరిటీగా ఉపయోగిస్తున్నందున, దరఖాస్తు చేసేటప్పుడు ఆదాయ రుజువు పత్రాన్ని చూపించాల్సిన అవసరం లేదు. అందువల్ల ప్రాసెసింగ్ రుసుము ఉండదు.

రుణ చెల్లింపు సమయం
బ్యాంకులు లేదా NBFCలు వ్యక్తిగత రుణ దరఖాస్తులను స్వీకరించినప్పుడు, సెక్యూరిటీ లేని సమయంలో ఆదాయ రుజువును (Income Source) చూపించాల్సిన ఉంటుంది. దరఖాస్తుదారుకు తగిన రీపేమెంట్ సామర్థ్యం ఉందో లేదో కూడా తనిఖీ చేస్తారు. ఇది చాలా సమయం తీసుకునే ప్రక్రియ, ఇది రుణంలో జాప్యానికి దారితీస్తుంది. అయితే, గోల్డ్ లోన్‌లో ప్రక్రియ వేగంగా ఉంటుంది. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు నిమిషాల వ్యవధిలో రుణం అందిస్తున్నాయి. రుణదాతలు బంగారు వస్తువులను సెక్యూరిటీగా సమర్పించిన తక్షణమే రుణం అందజేస్తారు. 

ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్
పర్సనల్ లోన్‌తో పోలిస్తే గోల్డ్ లోన్ రీపేమెంట్ ఆప్షన్‌లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. గోల్డ్ లోన్ తీసుకున్నవారు వివిధ రీపేమెంట్ పద్ధతుల నుండి ఎంచుకోవచ్చు. గోల్డ్ లోన్‌లు మీ రీపేమెంట్ కెపాసిటీని పెంచుకోవడానికి అనేక రకాల సొల్యూషన్‌లను అందిస్తాయి, తద్వారా మీ లోన్‌ని తిరిగి చెల్లించడానికి మీకు ఉత్తమమైన అవకాశాన్ని అందిస్తాయి.

తక్కువ వడ్డీ రేట్లు
గోల్డ్ లోన్‌తో పోలిస్తే పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు చాలా ఎక్కువ. ఎందుకంటే వీటిలో గోల్డ్ లోన్ సెక్యూర్డ్ లోన్ మరియు పర్సనల్ లోన్ అన్ సెక్యూర్డ్. ఈ రెండు రకాల రుణాలలో ఎక్కువ మరియు తక్కువ వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం చాలా ముఖ్యమైనది.