శ్రావణ మాసం వచ్చేస్తోంది. దీంతో బంగారం ధరలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. అయితే ఇప్పటికీ అంతర్జాతీయంగా పసిడి ధర బలహీనపడటంతో దేశీయంగా కూడా బంగారం ధరలు ఒక నెల కనిష్ట స్థాయిలో ట్రేడవుతున్నాయి. దీంతో రాబోయే పెళ్లిల్ల సీజన్ లో బంగారం కొనుగోలు చేసేవారికి ప్రస్తుతం మంచి చాన్స్ ఉందని చెప్పవచ్చు.
దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరల్లో చాలా ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి.అయినప్పటికీ కస్టమర్లలో కొనుగోళ్ల పరిస్థితి కనిపిస్తోంది. మీరు కూడా బంగారం చూస్తున్నట్లయితే, ఇప్పుడే ఆలస్యం చేయకండి, ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం దాని అత్యధిక స్థాయి నుండి దాదాపు రూ. 4,700 వరకు చౌకగా అమ్ముడవుతోంది.
అయితే ఉపశమనం కలిగించే మరో విషయం ఏమిటంటే.. గురువారం ఉదయం కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టాయి. గురువారం బంగారం ధర 4 క్యారెట్లు, 22 క్యారెట్లకు రూ.130 తగ్గింది. క్రితం రోజు హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50,550 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.46,310గా ఉంది.
ఏపీ రాజధాని విజయవాడలో ఈ రోజు 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.50,885 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ.46,927గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.50,620 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.46,400గా ఉంది. విశాఖ పట్నంలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.50,620 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ.46,400గా ఉంది.
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50,620 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.46,400గా ఉంది.
నెల్లూరులో గురువారం నాడు 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.50,620 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.46,400గా ఉంది. గత 24 గంటల్లో 24 క్యారెట్ల (10 గ్రాములు), 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.110 పెరిగింది.
మీ నగరంలో బంగారం ధర తెలుసుకోండి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మినహా శని, ఆదివారాల్లో రేట్లు IBJA జారీ చేయడం లేదు. 22 క్యారెట్లు మరియు 18 క్యారెట్ల బంగారు ఆభరణాల రిటైల్ ధరలను తెలుసుకోవడానికి మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. SMS ద్వారా రేట్లు త్వరలో అందుతాయి. ఇది కాకుండా, తరచుగా అప్‌డేట్‌ల గురించి సమాచారం కోసం, మీరు www.ibja.co సందర్శించవచ్చు. అందుకే బంగారం కొనే ముందు మీ నగరంలో ధరను తెలుసుకోవచ్చు.
