భారతదేశంలో బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. ఎంసిఎక్స్ ప్రకారం ఫ్యూచర్స్ గోల్డ్ ఒప్పందాల ధరలు 10 గ్రాములకి 0.40% తగ్గి 37,746  చేరుకున్నాయి. ఎంసిఎక్స్ వెబ్‌సైట్ ప్రకారం  ఐదవ రోజు కూడా క్షీణించిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు కూడా తక్కువగా ఉన్నాయి.

aslo read  బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ...కారణమేమిటంటే! 

ఎంసిఎక్స్‌లో వెండి ధర కిలోకు 0.80 శాతం పడిపోయి 44,135 కు చేరుకున్నాయి. యుఎస్ మరియు చైనా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం వైపు కొన్ని సానుకూల పరిణామాల మధ్య ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు ఈ వారం ఒక వారం కనిష్టానికి పడిపోయాయి.స్పాట్ బంగారం ధరలు ఔన్స్ కు 0.1% పడిపోయి 1,461.02 డాలర్లకు చేరుకోగా, వెండి 0.3 శాతం తగ్గి  ఔన్స్ కు 16.95 డాలర్లకు చేరుకుంది.


గత రెండు నెలలుగా ధరల తగ్గుదల ఉన్నప్పటికీ బంగారం రిటైల్ డిమాండ్ గత వారం భారతదేశంలో నిరాశగా ఉంది. బలహీనమైన డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం ధరలు పెరిగాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు భారతదేశంలో బంగారం ధరలు 20% పెరిగాయి.

also read  అమ్మో కార్వీ!! సంక్షోభం నుంచి కోలుకుంటుందా?!!


భారతదేశంలోని డీలర్లు గత వారం అధికారిక దేశీయ బంగారం ధరలపై 3 ఔన్స్ కు 3 డాలర్ల తగ్గింపును అందిస్తున్నారని, అంతకుముందు వారంతో పోలిస్తే ఔన్స్ కు 1.5 డాలర్లని రాయిటర్స్ నివేదించింది. దేశీయ ధరలో 12.5% ​​దిగుమతి పన్ను మరియు 3% జీఎస్టీ ఉన్నాయి. అక్టోబర్‌లో భారతదేశ బంగారు దిగుమతులు ఏడాది క్రితం కంటే మూడో వంతు పడిపోయి, వరుసగా నాలుగవ నెలకు పడిపోయాయి.