బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట. పసిడి రేటు ఈరోజు నిలకడగానే కొనసాగింది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. నిన్న భారీగా పెరిగిన బంగారం రేటు నేడు స్థిరంగా కొనసాగడం గమనార్హం.  

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం బంగారం, క్రూడ్ ఆయిల్ ధరలపై విపరీతంగా పడుతోంది. అటు బ్యారెల్ ధర, ఇటు తులం బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ముఖ్యంగా పసిడి ధర రోజురోజుకూ పరుగెడుతోంది. 

ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. అయితే బుధ‌వారం (మార్చి 9, 2022) బంగారం, వెండి ధరలు కాస్త ఊరట కలిగించాయి. మంగ‌ళ‌వారం భారీగా పెరిగిన పసిడి రేటు నేడు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి రేటు మాత్రం భారీగా దిగివచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి (మార్చి 9, 2022) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 49,400 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 54,760కు చేరుకుంది. ఇక ఆర్థిక రాజ‌ధాని ముంబైలో కూడా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 49,400 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 53,890గా ఉంది. అటు చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 55 వేలకు చేరువలో ఉంది. చెన్నైలో రూ. 54,760గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,200కు చేరుకుంది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద కొనసాగుతోంది.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 49,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 53,890గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 49,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 53,890గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

వెండి ధ‌ర‌లు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 70,000గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 70,000 పలుకుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.74,600గా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ. 74,600 పలుకుతోంది. ఇక‌పోతే తెలుగు రాష్ట్రాలైన‌.. హైదరాబాద్‌లో కిలో వెండి ధ‌ర‌ రూ. 74,600గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 74,700గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది.