బంగారం ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. ఆదివారం పైపైకి దూసుకుపోయిన పసిడి రేటు సోమ‌వారం (మార్చి 7, 2022) నిలకడగానే కొనసాగింది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు.

బంగారం ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. ఆదివారం పైపైకి దూసుకుపోయిన పసిడి రేటు సోమ‌వారం (మార్చి 7, 2022) నిలకడగానే కొనసాగింది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి కూడా నిలకడగానే ఉంది.అంతర్జాతీయంగా బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 48,400గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 48,400గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 49,700గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 54,220 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 48,400గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలైన‌.. హైదరాబాద్‌లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించ‌లేదు. 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,400 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 52,800గా కొన‌సాగుతోంది.

వెండి ధ‌రలు
దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 70,000 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 70,000గా నమోదైంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,400గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,400 వద్ద కొనసాగుతోంది. హైద‌రాబాద్‌లో కిలో వెండి ధర రూ. 73,400గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 73,400 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 73,400గా కొన‌సాగుతోంది.