బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. తులం బంగారం ధర ఏకంగా రూ. 500 పెరిగింది. దీంతో పసిడి ప్రేమికులలు గగ్గోలు పెడుతున్నారు. 

బంగారం , వెండి ఫ్యూచర్లు ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ఫ్యూచర్స్ ధర 56 వేల రూపాయలకు చేరువైంది. దీంతో పాటు వెండి ఫ్యూచర్స్ ధర కూడా పెరిగి రూ.65 వేలకు చేరువైంది. సోమవారం, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ రూ. 55,878 వద్ద ప్రారంభమైంది. వార్తలు రాసే సమయానికి, ఈ గోల్డ్ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.55,980 వద్ద ఆల్ టైమ్ హైని తాకింది. అంటే పసిడి ధర దాదాపు 56 వేల రూపాయలు తాకింది. పసడి ధర రూ. 219 లాభంతో ట్రేడవుతోంది. గత నెలలో, గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.58,847 వద్ద ఆల్ టైమ్ హైని తాకినట్లు గమనించాలి. 

ఈరోజు బంగారంతో పాటు వెండి ఫ్యూచర్స్ ధరలో కూడా పెరుగుదల నమోదైంది. MCXలో సిల్వర్ మే కాంట్రాక్ట్ ఈరోజు రూ. 64,657 వద్ద ప్రారంభమైంది, వార్త రాసే సమయానికి ఈ కాంట్రాక్టు పై స్థాయి రూ.64,934కి చేరుకుంది, దాదాపు రూ.65 వేలకు చేరుకుంది. వార్తలు రాసే సమయానికి వెండి ఫ్యూచర్స్ రూ.419 లాభంతో రూ.64,820 వద్ద ట్రేడవుతోంది. వెండి ఫ్యూచర్లు గత నెలలో కిలో రూ.72,000కి చేరాయి.

మరోవైపు రిటైర్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నగల వ్యాపారం చేసేవారికి పసిడి ధరలు మరోసారి షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56040 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో బంగారం ధర గత వారంతో పోల్చితే, దాదాపు రూ.500 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51 వేలు దాటింది. అలాగే బంగారం ధరలు అటు ఢిల్లీలో కూడా బంగారం ధరలు గత వారంతో పోల్చితే 500 చొప్పున పెరిగాయి దీంతో పసిడి షాపింగ్ చేసే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి.