Asianet News TeluguAsianet News Telugu

మాంద్యం గుప్పిట్లో ప్రపంచం... భారీ ఎత్తున Apple, Google ఉద్యోగుల తొలగింపు సన్నాహాలు దేనికి సంకేతం..?

కరోనా అనంతరం ప్రపంచం ఆర్థిక వ్యవస్థలు కుదేలు అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్, చైనా లాంటి ఆర్థికవ్యవస్థలు మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయి. 2007 నాటి పరిస్థితులు మళ్లీ వస్తాయా అనే భయం నిపుణుల్లో ఉంది.

Global Recession Hit by recession now companies like Google and Apple are taking these steps
Author
Hyderabad, First Published Aug 17, 2022, 11:31 AM IST

తాజాగా ప్రపంచ ఆర్థిక మాంద్యం  గూగుల్ , యాపిల్ లాంటి  పెద్ద టెక్ కంపెనీలను కూడా గట్టిగా దెబ్బతీస్తోంది. మాంద్యం నేపథ్యంలో సిలికాన్ వ్యాలీలోని ప్రసిద్ధ ఐటీ కంపెనీలు ఇప్పటికే పింక్ స్లిప్స్ ఇవ్వడం ద్వారా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ సైతం తమ ఉద్యోగులను రాబోయే పరిస్థితులకు  సిద్ధంగా ఉండాలని కోరింది. మరోవైపు యాపిల్ ఇప్పటికే 100 మంది కాంట్రాక్ట్ రిక్రూటర్‌లను  తొలగించింది.

ఇన్‌సైడర్ రిపోర్ట్ ప్రకారం, గూగుల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పటికే తమ ఉద్యోగులను లేఆఫ్‌ల విషయంలో హెచ్చరించారు. అంతేకాదు గూగుల్ క్లౌడ్ సేల్స్ బృందాన్ని సైతం తొలగింపులు తప్పవని ఎగ్జిక్యూటివ్‌లు హెచ్చరించారించినట్లు వార్తలు వస్తున్నాయి. నెక్ట్స్ క్వార్టర్ ఫలితాలు మెరుగుపడకపోతే, క్లౌడ్ సేల్స్ టీం నుంచి భారీగా కోతలు విధిస్తున్నామంటూ తెలిపారు. అంతేకాదు అటువైపు గూగుల్ రెండు వారాల పాటు రిక్రూట్ మెంట్ నిలిపివేసింది. అటు ఉద్యోగాలపై కత్తి వేలాడుతున్నట్లు కంపెనీ ఉద్యోగి ఒకరు ఇన్‌సైడర్‌తో చెప్పారు. ఇదిలా ఉంటే కొత్త రిక్రూట్‌మెంట్‌పై 2 వారాల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా సందిగ్ధత నెలకొని ఉంది.  

ఉద్యోగులకు సుందర్ పిచాయ్ హెచ్చరిక..
అంతకుముందు, Google CEO సుందర్ పిచాయ్ గత నెలలో ప్రొడక్టవిటీ మెరుగుపరచాలని ఉద్యోగులను కోరారు. Google వరుసగా రెండవ క్వార్టర్ లో ఊహించిన దాని కంటే తక్కువ ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్బంగా సుందర్ పిచాయ్‌తో జరిగిన ఆ సమావేశంలో 17 వేల మందికి పైగా గూగుల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే కంపెనీ ఉద్యోగులను తొలగించబోతోందా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నకు కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియోనా సికోనీ స్పందిస్తూ, తక్షణమే కంపెనీని ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని, అయితే ముందు ముందు లే ఆఫ్స్ విషయంలో తోసిపుచ్చలేమని చెప్పారు.

ఈ కారణం ప్రమాదకరమని విశ్లేషకులు చెబుతున్నారు
ప్రపంచంలోని రెండవ అత్యంత విలువైన కంపెనీ ఆపిల్ సైతం కొత్త రిక్రూట్‌మెంట్‌లు చేసే 100 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కంపెనీ తొలగించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, కంపెనీ ప్రస్తుత వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకుని తొలగిస్తున్నట్లు యాపిల్ తన కాంట్రాక్టు ఉద్యోగులకు తెలిపింది. అంతకుముందు, బ్లూమ్‌బెర్గ్ గత నెలలో ఒక నివేదికలో ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీ ఆపిల్ రిక్రూట్‌మెంట్ వేగాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కంపెనీ CEO టిమ్ కుక్ కూడా బ్లూమ్‌బెర్గ్ నివేదికను ఆదాయాల కాన్ఫరెన్స్ కాల్‌లో ధృవీకరించారు. విశ్లేషకులు దీనిని మాంద్యం , ప్రమాదకరమైన సంకేతంగా పరిగణిస్తున్నారు, ఎందుకంటే Apple వంటి పెద్ద కంపెనీలు అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే తొలగింపులను చేస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios