న్యూ ఢీల్లీ: చమురు మార్కెటింగ్ సంస్థలు సోమవారం ఇంధన ధరలను మరోసారి సవరించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్ ధర    లీటరుకు 29 పైసలు, డీజిల్ పై 24 పైసలు పెంచింది. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .94.23, డీజిల్ లీటరు రూ .85.15కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .100 నుంచి రూ .100.47కు, డీజిల్ లీటరుకు రూ .92.45 కు చేరుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు నగరాల్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే రూ .100 మార్కును దాటాయి.  మే 3 నుంచి ఇంధన ధరలు దేశవ్యాప్తంగా పెట్రోల్‌ లీటరు ధర రూ. 3.83, డీజిల్ రేటు రూ.4.42 పెరగటం గమనార్హం.

 31 మే 2021న దేశంలోని పలు మెట్రో నగరాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు

లక్నోలో పెట్రోల్ రూ .91.41, డీజిల్ రూ .85.28

భోపాల్‌లో  పెట్రోల్ రూ .102.04, డీజిల్ లీటరుకు రూ .93.37

జైపూర్‌లో పెట్రోల్ రూ .100.44, డీజిల్ లీటరుకు రూ .93.66

also read ముంబైలోని అమితాబ్ బచ్చన్ లగ్జరీ ఫ్లాట్.. ఈ ఇంట్లో బాత్రూమ్ ఫిటింగ్స్ కోసం ఫ్రాన్స్, జర్మనీ నుండి ఆర్...

రాయ్‌పూర్‌లో పెట్రోల్ రూ .92.51, డీజిల్ లీటరుకు రూ .92.13

పాట్నాలో పెట్రోల్ రూ .96.38, డీజిల్ రూ .90.42

నోయిడాలో పెట్రోల్ రూ .91.72, డీజిల్ లీటరుకు రూ .85.62

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.63, డీజిల్ రూ.92.54

ఇంధన ధరలు నిరంతరం ఎందుకు పెరుగుతున్నాయి?

వ్యాట్, సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల బట్టి ఇంధన ధరలు రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. దేశంలో పెట్రోల్‌పై అత్యధిక వాల్యు ఆధారిత పన్ను (వ్యాట్) ను రాజస్థాన్ విధిస్తుంది, తరువాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఇంధన ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ పన్ను ఒక కారణం.