Asianet News TeluguAsianet News Telugu

వాహనదారులపై పెట్రోల్, డీజిల్ ధరల పిడుగు...వరుసగా 12వ రోజు కూడా పెంపు..

గత 12 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.6.55, డీజిల్ పై లీటరుకు రూ .7.04 పెంచింది. జూన్ 7 న చమురు కంపెనీలు ఇంధన ధరలను సవరించడం ప్రారంభించాయి.
 

Fuel Price Today: Petrol, diesel prices hiked for 12th consecutive day in a row
Author
Hyderabad, First Published Jun 18, 2020, 1:23 PM IST

దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా 12 వ రోజు కూడా పెంచింది. ప్రస్తుతం దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు రూ .77.81, డీజిల్ ధర లీటరుకు రూ .76.43 రూపాయలు.

కరోనా వైరస్ మహమ్మారి మధ్య ఇంధన ధరలు 82 రోజుల లాక్ డౌన్ విరామం తర్వాత  ప్రభుత్వ-చమురు మార్కెటింగ్ సంస్థలు (ఒఎంసి) గురువారం వరుసగా 12 వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర పై లీటరుకు 53 పైసలు, డీజిల్ ధర పై  లీటరుకు 64 పైసలు పెంచింది.


గత 12 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.6.55, డీజిల్ పై లీటరుకు రూ .7.04 పెంచింది. జూన్ 7 న చమురు కంపెనీలు ఇంధన ధరలను సవరించడం ప్రారంభించాయి. ఈ రోజు భారతీయ మెట్రో నగరాలు & రాష్ట్ర రాజధానులలో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి

న్యూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర  77.81, పాత ధర  77.28
కోల్‌కతా ప్రస్తుత  ధర   79.59, పాత ధర 79.08 
ముంబై ప్రస్తుత  ధర  84.66, పాత ధర 84.15
చెన్నై ప్రస్తుత  ధర  81.32, పాత ధర 80.86
గుర్గావ్ ప్రస్తుత  ధర  76.19, పాత ధర 75.83
నోయిడా ప్రస్తుత  ధర  79.06, పాత ధర 78.86
బెంగళూరు ప్రస్తుత  ధర  80.33, పాత ధర 79.79
భువనేశ్వర్ ప్రస్తుత  ధర 78.21, పాత ధర 77.82
చండీఘడ్ ప్రస్తుత  ధర 74.90, పాత ధర 74.39
హైదరాబాద్ ప్రస్తుత  ధర  80.77 , పాత ధర 80.22
జైపూర్ ప్రస్తుత  ధర  84.79, పాత ధర 84.22
లక్నో ప్రస్తుత  ధర  78.92, పాత ధర 78.52
పాట్నా ప్రస్తుత  ధర  81.44, పాత ధర 80.89
త్రివేండ్రం ప్రస్తుత  ధర  79.38, పాత ధర 79.00

నేడు భారతీయ మెట్రో నగరాలు & రాష్ట్ర రాజధానులలో డీజిల్ ధరధరలు ఇలా ఉన్నాయి


న్యూ ఢిల్లీలో లీటర్ డీజిల్  ధర 76.43 75.79
కోల్‌కతా ప్రస్తుత  ధర 71.96, పాత ధర 71.38
ముంబై ప్రస్తుత  ధర 74.93, పాత ధర 74.32
చెన్నై ప్రస్తుత  ధర 74.23, పాత ధర 73.69
గుర్గావ్ ప్రస్తుత  ధర 69.02, పాత ధర 68.51
నోయిడా ప్రస్తుత  ధర 69.36, పాత ధర 69.08
బెంగళూరు ప్రస్తుత  ధర 72.68, పాత ధర 72.07
భువనేశ్వర్ ప్రస్తుత  ధర 74.52, పాత ధర 74.03
చండీఘడ్ ప్రస్తుత  ధర 68.32, పాత ధర 67.75
హైదరాబాద్ ప్రస్తుత  ధర 74.70, పాత ధర 74.07
జైపూర్ ప్రస్తుత  ధర 77.29, పాత ధర 76.66
లక్నో ప్రస్తుత  ధర 69.24, పాత ధర 68.76
పాట్నా ప్రస్తుత  ధర 74.39, పాత ధర 73.76
త్రివేండ్రం ప్రస్తుత  ధర 73.69, పాత ధర 73.22

బుధవారం పెట్రోల్ ధర లీటరుకు 55 పైసలు, డీజిల్ ధరపై 69 పైసలు పెంచింది, మంగళవారం అయితే, పెట్రోల్ ధరపై లీటరుకు 47 పైసలు పెరిగింది, డీజిల్ ధర 57 పైసలు పెంచింది.అంతకుముందు సోమవారం పెట్రోల్ ధరపై 48 పైసలు, డీజిల్ ధరపై 59 పైసలు పెంచింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios